హైకోర్టు సంచలన నిర్ణయం, తల్లి ఆస్తిలో కూతురికి హక్కు లేదు..!
ఇప్పటికీ తల్లిదండ్రుల ఆస్తులపై కుమార్తెలకు ఉన్న హక్కుల గురించి చాలా మందికి అవగాహన లేదు. అందరూ కుమారులకే ఆస్తి దక్కుతుందనే అపోహలో ఉంటారు. పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తెలను అసలు ఆస్తి పంపకాల్లో భాగంగా పరిగణించరు. అయితే ఈ విషయంలో చట్టపరమైన హక్కులు, నిబంధనల గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా తల్లి చట్టబద్ధంగా అమలయ్యే వీలునామా రాయకుండా మరణించిన సందర్భంలో కుమార్తెలకు వర్తించే హక్కులను తెలుసుకోవాలి.
అయితే తాజాగా ఒక కేసులో తల్లి ఆస్తికి సంబందించి కూతురు, ఆమె భర్త ఆస్తి హక్కు కోసం హైకోర్టుని ఆశ్రయించారు. కేసు పరిశీలించిన వారు తమ పేరిట ఉన్న ఆస్తి తప్ప ప్రత్యేకమైన హక్కులు ఉండదని స్పష్టం చేసింది. ఢిల్లీలో శాస్త్రి నగర్ లో 85 ఏళ్ల వృద్ధురాలు 1985 లో ఆస్తిలో కొంత భాగం వాడుకునేందుకు కూతురికి ఇచ్చింది. ఐతే ఇప్పుడు ఆ ఆస్తి తమదే అంటూ వారు కోర్టుని ఆశ్రయించారు. ఐతే తల్లి ఆస్తిపై ఆమె అనుమతిలేనిదే ఆ ఆస్తి ఎవరికి చెందదని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు ఇన్నాళ్లు ఆమె ఇంట్లో ఉన్నందుకు కోర్టు తిరిగి కూతురు అల్లుడికి ఆమెకు నెల నెల 10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. స్త్రీ ప్రత్యేక హక్కులో భాగంగా భర్త లేదా వారసత్వ ఆస్తి తల్లి ఇష్టానుసారంగా ఇవ్వడమే తప్ప అది కూతురికి వారసత్వంగా వచ్చే అవకాశం లేదు. ఆ ఆస్తి మీద ఆమెకే పూర్తి యజమానత్వం ఉంటుంది. ఈ తీర్పు ప్రకారం కూతురు అల్లుడు వారి కుటుంబ సంబణాల కారణంగా ఆస్తిపై ఆటోమెటిక్ హక్కులు వారసత్వంగా పొందరని స్పష్టం చేసింది.