Health

పుట్టగొడుగులు తినేముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.

పుట్టగొడుగులు తెలుపు, నలుపు, గోధుమ వర్ణాలలో రకరకలుగా ఉంటాయి. ఆయుర్వేద భావప్రకాశ సంహితలో పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగినవి తెల్ల రంగులో ఉన్నవి తినడానికి యోగ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కర్రలు, పేడలపై పుట్టినవి తెల్లగా ఉంటే అంతగా దోషకరం కావు కాబట్టి వాటిని కూడా తినొచ్చు. అయితే ప్రతి ఒకరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి చూసుకుంటున్నారు.

ఆరోగ్యంగా ఉండడానికి సరైన జీవన విధానాన్ని అనుసరించడం మంచి ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. బరువు కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. అయితే పుట్టగొడుగుల వల్ల ఎన్నో లాభాలు మనకి కలుగుతాయి.

పుట్టగొడుగులని అల్పాహారం సమయంలో తీసుకుంటే బరువుని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు అయితే అల్పాహారం సమయంలో మీరు పుట్టగొడుగులు తీసుకుంటే బరువు తగ్గొచ్చు. గుడ్లు తో పాటుగా పుట్టగొడుగులని మీరు ఆమ్లెట్ వేసుకొని తీసుకోవచ్చు. చక్కగా పోషక పదార్థాలు మీకు అందుతాయి అలానే పుట్టగొడుగులతో సలాడ్ కూడా చేసుకోవచ్చు దీనిని మీరు భోజనం సమయంలో తీసుకుంటే మంచిది.

పుట్టగొడుగులతో సూప్ కూడా చేసుకోవచ్చు సాయంత్రం పూట స్నాక్స్ కింద పుట్టగొడుగులని తీసుకుంటే ఆకలి తీరుతుంది. పైగా పోషక పదార్థాలు కూడా మీకు అందుతాయి. బేక్ చేసి కూడా మీరు పుట్టగొడుగులని తీసుకోవచ్చు. అయితే ఇలా మీకు నచ్చిన విధంగా పుట్టగొడుగులని తీసుకుని చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు. అయితే నిజానికి పుట్టగొడుగుల తో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి.

పుట్టగొడుగులని డైట్ లో తీసుకోవడం వలన క్యాన్సర్ రిస్క్ ఉండదు సోడియం కూడా బాగా తక్కువ తీసుకోవడానికి సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యానికి పుట్టగొడుగులు బాగా హెల్ప్ చేస్తాయి. కొలెస్ట్రాల్ని కూడా పుట్టగొడుగులతో తగ్గించుకోవచ్చు. గట్ హెల్త్ కూడా బాగుంటుంది ఇలా చాలా లాభాలు పుట్టగొడుగులతో మనం పొందొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker