ఉదయాన్నే శరీరంలో కనిపించే ఈ లక్షణాలు పెను ప్రమాదానికి సంకేతం. అలసత్వం చేస్తే అంతే..?
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య, ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించగలం. కచ్చితమైన ఆహార నియమాలతో పాటు డాక్టర్స్ సూచించిన మందులు తీసుకోవడం వలన షుగర్ వ్యాధి ముదరకుండా కాపాడుకోవచ్చు.
కాబట్టి ఈ పరిస్థితి తెచ్చుకోవడం కంటే, మధుమేహం రాకుండా అదుపుచేసుకోవడం మంచిది. అయితే డయాబెటిస్ సైలెంట్ కిల్లర్, ఇది క్రమంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. ఈ డయాబెటిస్ నుంచి ప్రాణాలను కాపాడుకోవాలంటే.. ముందుగా గుర్తించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి. మరి దీన్ని గుర్తించడం ఎలా? ఈ వ్యాధి మొదటి సంకేతాలు ఎలా ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు ఎలా తెలుస్తుంది? అంటే చాలా లక్షణాలు కనిపిస్తాయిన చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే శరీరంలో కనిపించే లక్షణాలు డయాబెటిస్‌కు సంకేతాలుగా పేర్కొంటున్నారు. ఆ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. భారతదేశంలో గత కొన్నేళ్లుగా మధుమేహ బాధితుల సంఖ్యంగా భారీగా పెరుగుతోంది.
మధుమేహం అనేది జీవక్రియకు సంబంధించిన రుగ్మత. మధుమేహం బాధితుల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవదు. తత్ఫలితంగా శరీరంలోని అవయవాల పనితీరు తగ్గుతుంది. క్రమంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు, చర్మం, గుండె, కళ్లు, మొత్తం శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది.
మధుమేహం ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత కాలంలో పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, యువకులు టైప్ 1 మధుమేహం బారిన పడుతున్నారు. టైప్ 2 మధుమేహం 40 ఏళ్ల తరువాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధుమేహం మూత్రపిండాలు, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.