Health

ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకొని తాగండి చాలు, మీ శరీరంలో ఈ అద్భుతలు చూస్తారు.

నిద్రపోతున్నప్పుడు శరీరం నీరు, లవణాలను కోల్పోతుంది. నిద్ర లేవగానే గోరువెచ్చని ఉప్పునీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. ఈ సాల్ట్ వాటర్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి లవణాలను కూడా శరీరంలో తిరిగి నింపుతుంది. ఇవి శరీరంలోని ద్రవాలను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి, అలానే నరాలు, కండరాలు బాగా పని చేసేలా చూస్తాయి. అయితే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్పు తినడం ప్రమాదకరమని చెబుతారు. అది పూర్తిగా నిజం.

అయితే మన రోజువారీ అవసరాలకు మనకు కొంత ఉప్పు అవసరం పడుతుంది. ఆ ఉప్పును మాత్రం మనం కచ్చితంగా తినాలి. లేకుంటే శరీరం ఇతర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఉప్పు కలిపిన నీటితో ఉపయోగాలు.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ అవుతుంది. నిద్ర పోయినప్పుడు ఎనిమిది గంటల పాటు నీరు తాగని వారి సంఖ్య ఎక్కువే. ఉదయాన్నే ఇలా గోరువెచ్చని ఉప్పు నీటిని తాగడం వల్ల ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ అవుతాయి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.

జీర్ణ ఆరోగ్యానికి గోరువెచ్చని ఉప్పునీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది పొట్టలోని పేగులను చురుగ్గా కదిలేలా చేస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఈ గోరువెచ్చని ఉప్పునీరు వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. శరీరంలోని విషాలు, వ్యర్ధాలు బయటకు పోతాయి. గోరువెచ్చని ఉప్పు నీరు తాగడం లేదా ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస కోశ సమస్యలు తగ్గిపోతాయి. ముక్కు దిబ్బడ కట్టడం, ఊపిరితిత్తులకు శ్లేష్మం పట్టడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. సైనసైటిస్, అలెర్జీలు, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు ఉప్పు నీటిని తాగితే ఎంతో మంచిది.

గోరువెచ్చని ఉప్పునీరు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ కి గురవుతుంది. అలాగే చర్మానికి డిటాక్సిఫికేషన్‌కి కూడా పని చేస్తుంది. చర్మం మెరుపు సంతరించుకోవడంతోపాటు మలినాలు తొలగిపోతాయి. చర్మంపై మొటిమలు వచ్చే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. కాబట్టి చర్మం మెరవడం ఖాయం. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తినడానికి భయపడతారు. వారు కూడా పూర్తిగా ఉప్పు తినడం మానేస్తే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో ఉప్పును తగ్గించుకొని…

ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల రక్తపోటు స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించేది ఎలక్ట్రోలైట్స్. ఈ గోరువెచ్చని ఉప్పు నీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె పనితీరుకు, కండరాల పనితీరుకు వీటిలో ఉండే సోడియం అవసరం. ఇలా ప్రతిరోజూ చిటికెడు ఉప్పును గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరగడంతో పాటు జీవక్రియ సవ్యంగా సాగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker