Health

నిద్రలేచిన వెంటనే మెడనొప్పి వస్తుందా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?

సుదీర్ఘమైన ఒత్తిడి, అసౌకర్య స్థితిలో నిద్రించడం, ఒత్తిడికి మెడనొప్పి కారణమవుతుంది. మేడ నొప్పి దీర్ఘకాలం పాటు ఉంటే అది ఆస్టియో ఆర్థరైటిస్, స్పైనల్ స్టెనోసిస్, హెర్నియేటెడ్ డిస్క్, నరాలలో సూదులతో గుచ్చుతున్నట్టు బాధ , మానసిక మరియు శారీరక ఒత్తిడి, కణితులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది. రోజుల నుండి సంవత్సరాల వరకు మెడ నొప్పి కారణాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

అయితే కొంతమందికి ఉదయం నిద్రలేచిన వెంటనే మెడ నొప్పిగా ఉంటుంది. అంతేకాదు మెడను కదిలించడంలో ఇబ్బంది ఉంటుంది. ఎత్తుగా దిండు వేసుకోవడం, తప్పుడు భంగిమలో పడుకోవడం, గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం ఇలా చాలా కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ అలవాట్లను మార్చుకునక్న తర్వాత కూడా మెడ నొప్పి తగ్గదు.

మెడ ఉష్ణోగ్రత.. మెడనొప్పి చాలా కాలం నుంచి ఉంటే కండరాలకు కొంత వేడిని అప్లై చేయాలి. దీని కోసం హాట్ వాటర్ బ్యాగ్ తో నెక్ మసాజ్ చేయాలి. కొంతమంది మెడకు ఐస్ బ్యాగ్ అప్లై చేస్తుంటారు. రెండు పద్ధతులను అవలంబించడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. దీన్ని 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే చేయాలి. లేదంటే చాలా నష్టాన్ని భరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్ మెడ వాపు తగ్గాలంటే డాక్టర్ సలహా మేరకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు లేదా పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. ఇది నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే దీనికి ముందు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని గుర్తుంచుకోండి. మసాజ్ చేయాలి.. నొప్పిని వదిలించుకోవడానికి మసాజ్ చేసే టెక్నిక్ శతాబ్దాలుగా కొనసాగుతోంది.

మెడ నొప్పికి అమ్మమ్మ కాలం నాటి ఈ చిట్కాని పాటించవచ్చు. అయితే మసాజ్ చేసుకునే బదులు ఫిజియోథెరపిస్ట్ సహాయం తీసుకుంటే మంచిది. ఒకే చోట కూర్చోవడం లేదా శారీరక శ్రమ చేయకపోవడం వల్ల మనకు మెడనొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు వ్యాయామం, యోగా చేయాలి. నొప్పిని వదిలించుకోవడానికి మెడ వ్యాయామాలు, యోగా సహాయం తీసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker