ఉదయాన్నే కలబంద రసం తాగుతున్నారా..! ఈ విషయాలు మీకోసమే.
కలబంద రసం తాగడం వల్ల అనేక వ్యాధులకు మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ ఎ , విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి6 మరియు విటమిన్ బి12 ఉంటాయి. సోడియం, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, జింక్, క్రోమియం, సెలీనియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు కలబందలో ఉంటాయి. ఇది అనేక వ్యాధులకు దివ్వౌషధంగా పని చేస్తుంది. అయితే అనేక రకాల శారీరక , మానసిక సమస్యలకు అలోవెరా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ప్రజలు వారి వారి సమస్యకు అనుగుణంగా ఉపయోగిస్తారు. ఎవరికైనా కడుపు సమస్య ఉంటే వారు కలబంద రసం తాగుతారు.
చర్మం ,చుండ్రుకు సంబంధించిన సమస్యలు ఉంటే, అలొవెర జెల్‌ను ముఖం , జుట్టుకు పూస్తారు. కలబంద జ్యూస్ ఖాళీ కడుపుతో తాగితే చాలామంచిదని భావిస్తుంటారు. కలబంద రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ మరియు బి-కాంప్లెక్స్ విటమిన్లు అలాగే కాల్షియం, మెగ్నీషియం, జింక్ ,పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో కలబంద రసం తాగడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మంచిది.
ఇది ఆహారం జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది. కలబంద మొక్క రక్తంలో చక్కెర , కొవ్వును నియంత్రించే అవసరమైన ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఉబ్బరం , మలబద్ధకం వంటి జీర్ణశయాంతర సమస్యలకు కలబంద రసం గొప్ప నివారణ. జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఖాళీ కడుపుతో కలబంద రసం తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది సహజంగా పొట్టను శుభ్రపరుస్తుంది.
కడుపు వ్యర్థాలను బయటకు పంపడంలో ఇది చాలా సహాయపడుతుంది. కాలేయాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది. అలోవెరా జ్యూస్‌ని రోజూ తాగే వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఖాళీ కడుపుతో కలబంద తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఖాళీ కడుపుతో కలబంద రసం తాగడం వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కలబంద రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అయితే ఇది చాలా ప్రమాదకరమైన నష్టాలను కూడా కలిగి ఉంది.
దీన్ని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం లోపం ఏర్పడుతుంది, దీని కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం లేదా ఆగిపోతుంది. దీని కారణంగా, శరీరంలో బలహీనత వంటి లక్షణాలు గమనించబడతాయి. గర్భిణీ స్త్రీలు లేదా తమ బిడ్డకు పాలిచ్చే స్త్రీలు కలబంద రసం త్రాగకూడదు. ఇది అబార్షన్‌కు కూడా దారి తీస్తుంది. కలబంద రసం ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై మందు ప్రభావం తగ్గుతుంది. కాబట్టి త్రాగే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. చలికాలంలో కలబంద రసాన్ని తీసుకోకూడదు.