రోజూ పరగడుపున నాలుగు తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం.
మనం తులసిలోని కొన్ని అరుదైన లక్షణాల గురించి తెలుసుకుందాం. మీరు మీ కుటుంబాన్ని కరోనా నుండి మాత్రమే కాకుండా ఇతర తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా రక్షించుకోవచ్చు. అయితే భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తారు. తులసి మొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులు తింటే.. పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. తులసి ఆకులను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, జలుబు, జీర్ణక్రియ, ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయాన్ని పరగడుపున తులసి ఆకుల తింటే.. ఎలాంటి మేలు జరుగుతుంది.
మలబద్ధకాన్ని తొలగిస్తుంది.. మీరు, జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యతో పోరాడుతుంటే దీనికి తులసి ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. వాస్తవానికి తులసి ఆకులు జీర్ణక్రియ ప్రక్రియను సరిగ్గా ఉంచుతాయని పేర్కొంటున్నారు. ఒత్తిడి.. ఒత్తిడితో బాధపడుతున్న వారికి తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. రోజూ తీసుకుంటే.. ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వీటిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యం.. తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే, మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ తులసిలో పుష్కలంగా ఉన్నాయి. ఎముకలకు బలం.. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. తులసిలో ఉండే పొటాషియం, ఫోలేట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.