ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఆ సమస్యలన్నీ పరార్.
వెల్లుల్లిలో అలిసిన్ అనే ఓ ప్రత్యేక ఔషధ మూలకముంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజూ ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలుతీసుకుంటే మరిన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వెల్లుల్లితో చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వంట్లో కచ్చితంగా వెల్లుల్లిని చేర్చుకుంటాం. దీని వల్ల పురుషులకు ఎన్నో రకాల మేలు కలగడం ఖాయం.
రోజు పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణమని చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడే వారికి రోజు వీటిని తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి గుండె పోటు రాకుండా కాపాడతాయి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. శరీరంలో పేరుకున్న కొవ్వును ఇవి కరిగిస్తాయి. రక్తంలో ట్రైగ్లిజరడ్స్ ను తగ్గింి బరువు నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ఇందులో అల్జీమర్స్ (మతిమరుపు)ను పోగొట్టే లక్షణాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటి రోగాలు రాకుండా నిరోధిస్తాయి. వెల్లుల్లి తరచుగా తీసుకునే వారికి జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అందుకే వీటిని రోజు తీసుకోవడం ఉత్తమం. ఇవి రక్తహీనతను దూరం చేస్తాయి. ఆడవారిలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో వారికి ఔషధంలా ఇవి పనిచేస్తాయి.
రోజు వారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే ఇతర జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ ఎక్కువగా ఉత్పత్తి కావడానికి ప్రేరేపిస్తాయి. ఇలా వెల్లుల్లితో అధిక లాభాలు ఉన్నందున ప్రతి రోజు మనం ఆహారాల్లో వాడుకుని దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా ప్రయోజనం పొందాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా పప్పుల్లో ఎక్కువగా వెల్లుల్లినే వాడతాం.
అందులో వేసిన దానికి ఎంతో రుచి ఉంటుంది. దీంతో వాటిని ఏదో ఒక రూపంలో వాడుకుని మన అనారోగ్యాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెల్లుల్లితో రుచితోపాటు మంచి లాభాలు దాగి ఉండటంతో దాన్ని విరివిగా వాడుకునేందుకు ముందుకు రావాలి. వాటితో కలిగే ఫలితాలతో వాటిని తింటూ మన దేహాన్ని జబ్బుల బరి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి. అందరు ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లిని తింటూ ఉండాలి.