షుగర్ పేషెంట్స్ ఉదయం లేవగానే చెయ్యాల్సిన పనులు ఇవే.
షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా అవసరం. ఇందుకోసం చాలా ఆహార జాగ్రత్తలు పాటించాలి. అధిక ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయలు ఉన్నాయి. అయితే ఉదయం లేవగానే షుగర్ పేషెంట్లు కొన్ని పనులను చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది.
ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మీ పేగులను కూడా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఇలా ఉదయం లేవగానే గ్లాస్ నీళ్లను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం తగ్గుతుంది. షుగర్ పేషెంట్లకు మార్నింగ్ వాక్ చాలా అవసరం. ఈ నడక వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మార్నింగ్ వాక్ గొప్ప వ్యాయామం అనే చెప్పాలి.
ఎందుకంటే ఇది శరీరం సక్రమంగా పనిచేసేలా చేయడమే కాదు ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం లేవగానే రక్తంలో చక్కెర స్థాయిలను టెస్ట్ చేసుకోవాలి. ఇందుకోసం మార్కెట్ లల్లో గ్లూకోమీటర్లు ఉంటాయి. దీని సాయంతో ఇంటివద్ద మీరే టెస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని తింటే మరికొందరు మాత్రం రకరకాల టిఫిన్స్ ను తింటుంటారు. ఇంకొందరు బరువు పెరుగుతామనో.. టైం లేకనో మొత్తానికే బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు.
నిజానికి బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం అస్సలు మంచిది కాదు. ఉదయం పూట మీ ఆరోగ్యానికి మంచి చేసే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినండి. ఆయిలీ ఫుడ్స్ ను, తీపి పదార్థాలను అస్సలు తినకండి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. షుగర్ వ్యాధి కూడా పాదాల సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఉదయం నిద్రలేవగానే పాదాలను చూడండి. పాదాలు కానీ.. పాదాల గోర్ల రంగు గానీ మారినట్టైనా.. లేదా పాదాలపై ఏవైనా బొబ్బలు, గాయాలు గుర్తున్నా వెంటనే డాక్టర్ దగ్గరకు వెల్లడం మంచిది.