నిద్రలేవగానే మీకు ఇలానే అనిపిస్తుందా..? అది క్యాన్సర్ కావొచ్చు, జాగర్త.
సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. అయితే క్యాన్సర్ లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. అయితే గమనింపులోకి వచ్చిన ప్రతి లక్షణాన్ని క్యాన్సర్ కావచ్చేమో అని భయపడడం సమంజసం కాదు. కానీ ఏదైనా అసాధారణమైన లక్షణం లేదా అనుమానస్పద విషయం కనిపిస్తే మాత్రం అశ్రద్ధ తగదు.
మీరు శ్రద్ధ చూపించినప్పటికీ క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంబంధించిన లక్షణాలు ఇతర చిన్నచిన్న అనారోగ్యాలను పోలి ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి చిన్నచిన్న అనారోగ్యాలు కూడా క్యాన్సర్ వంటి పెద్దపెద్ద సమస్యల్లా కనిపిస్తాయి. ఒక్కోసారి రాత్రి పూట చెమటలు పట్టడం అనేది క్యాన్సర్ లక్షణం కావచ్చు. వేసవిలో ఇలా జరిగితే వేసవిలో చాలా నిర్లక్ష్యం చేస్తాం. నిద్రలో చెమటలు పట్టడం చాలా సార్లు గుర్తించకపోవచ్చు. కానీ పొద్దున్నే మీరు నిద్రించిన బెడ్ మీద షీట్స్, దిండ్లను గమనిస్తే మీకు అర్థమవుతుంది. అవి చెమట వల్ల మురికిగా అనిపిస్తాయి.
క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో చెమటలు రావడానికి ఇన్ఫెక్షన్ ఒక కారణంగా చెప్పవచ్చు. శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నపుడు శరీరంలో వేడి పెరుగుతుంది. దాన్ని తగ్గించేందుకు చెమటలు ఎక్కువగా వస్తాయి. క్యాన్సర్ మన శరీరంలోని నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ తో పోరాడేందకు ఏవిధంగా సన్నద్ధం అవుతుందో శరీరం అలాగే స్పందిస్తుంది. క్యాన్సర్ వల్ల లేదా క్యాన్సర్ చికిత్సల వల్ల కూడా హార్మోన్ స్థాయిలో మార్పుల వల్ల కూడా శరీరంలో హాట్ ఫ్లషెస్ రావచ్చు. హాట్ ఫ్లషెస్ కారణంగా చెమటలు ఎక్కువ పట్టవచ్చు.
రాత్రి పూట చెమటలు పట్టడం అనేది బోన్ క్యాన్సర్ లక్షణం కావచ్చని నిపుణులు అంటున్నారు. అదొక్కటే కాదు ఏదైనా క్యాన్సర్ ముదిరినపుడు ఈ లక్షణం కనిపించవచ్చట. అయితే బోన్ క్యాన్సర్ లో నిరంతరం ఎముక నొప్పిగా ఉంటుంది. సమస్య ప్రారంభంలో అప్పుడప్పుడు నొప్పి ఉంటుంది. కానీ ముదిరేకొద్దీ నొప్పి స్థిరంగా కొనసాగుతుంది. రాత్రి పూట లేదా ఏదైనా ఆక్టివిటిలో ఉన్నపుడు ఇది ఎక్కువగా ఉంటుంది.
ఎముక పైన వాపు, ఎర్రగా కందిపోయినట్టు కనిపిసతుంది. క్యాన్సర్ సోకిన ఎముక కీలుకు దగ్గరగా ఉంటే కదలికలు కూడా కష్టం అవుతాయి. రాత్రి సమయంలో చెమట చాలా ఎక్కువగా పడుతుంటే ఒకసారి వైద్య సలహా తీసుకోవడం మంచిది. విపరీతమైన చెమట అనేది కేవలం క్యాన్సర్ వల్ల మాత్రమే కాకపోవచ్చు. అందుకే డాక్టర్ ను సంప్రదించి సరైన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ డాక్టర్ కు కూడా అనుమానంగా ఉంటే ఆంకాలజిస్ట్ లేదా ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ కు సిఫారసు చేస్తారు.