ఉదయమే వెల్లుల్లి తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.
వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాం. అయితే ప్రతిరోజు మనం వంటలలో తప్పనిసరిగా ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి అయితే వెల్లుల్లిని కేవలం ఆహారం రుచిగా ఉండడం కోసం ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటు పడినట్లే. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అందుకే వెల్లుల్లిని తరచూ వంటలలో తినటం వల్ల మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది.
ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియా, విటమిన్లు, మాంగనీస్ ఎంతో సమృద్ధిగా లభిస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో ఏవైనా హానికర బ్యాక్టీరియాలు ప్రవేశించిన వెంటనే ఇందులో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియాల్ ఏజెంట్ హానికర బ్యాక్టీరియాలను నశింప చేయడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో హానికరమైన బ్యాక్టీరియాలను తొలగించి జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. అధిక రక్త పోటు సమస్యతో బాధపడేవారు తరచూ ఉదయమే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇకపోతే మూత్రశయ సమస్యలు,ఆస్తమా డిప్రెషన్ బట్టి సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతిరోజు ఉదయం వెల్లుల్లిని తీసుకోవటం వల్ల ఈ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్నవారు తరచు వెల్లుల్లి తినడం వల్ల త్వరగా డిప్రెషన్ నుంచి బయటపడటమే కాకుండా మానసిక ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
అలాగే మూత్రాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పటికీ తొలగించి మూత్రశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అధిక శరీర బరువుతో బాధపడేవారు తరచూ వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోవడంతో శరీర బరువును తగ్గించడానికి దోహదం చేస్తుంది. ఇలా వెల్లుల్లిలో అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువగా వీటిని తీసుకోవటం వల్ల మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజు ఉదయం రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.