Uncategorized

మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంచితే డబ్బుకు అస్సలు లోటు ఉండదు. ఆ వస్తువులు ఏంటంటే..?

డబ్బు లేకపోతే జీవతం లేదు అన్నట్టుగా తయారైంది. కష్ట పడి తెచ్చిన డబ్బు ఏ మాత్రం ఉండకుండా.. వెంటనే ఖర్చు అయిపోతుంటే.. చాలా బాధను కలిగిస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత కూడా నిలబడదు. అయితే కొన్ని రకాల వాస్తు దోషాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురైతాయన్న విషయాన్ని ఎవరూ గమనించారు. అయితే ఫెంగ్ షుయ్ వాస్తు శాస్త్రాన్ని చైనీయులు ఆచరిస్తారు. ఇక ఈ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఆనందంతో పాటు అభివృద్ధి ఉండాలంటే.. కచ్చితంగా ఈ వస్తువులు ఉండాలట. ఇవి నెగటివ్ ఎనర్జీని దూరం చేసి.. చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వ్యాపింపజేస్తాయి. అలాగే ఈ వస్తువులను మీ ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.

తాబేలు..పురాణాల ప్రకారం తాబేలు విష్ణు స్వరూపమని నమ్ముతారు. విష్ణుమూర్తి దశావతారాలలో కూర్మావతారం కూడా ఉంది. అంతే కాదు, ఫెంగ్ షుయ్ ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ఉత్తర దిక్కు.. సంపదకు దేవుడు అయిన కుబేరునితో సంబంధం కలిగి ఉంటుంది. కావున తాబేలును అక్వేరియంలో ఉత్తరం వైపు ఉంచితే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్తర దిశలో తాబేలును ఉంచితే కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. తాబేలు ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు.

లాఫింగ్ బుద్ధ..చైనీస్ వాస్తు శాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంట్లో ఉంచడం శుభపరిణామంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో ఉంచుకుంటే ఆ ఇల్లు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. లాఫింగ్ బుద్ధను సాధారణంగా ప్రధాన ద్వారం ముందు ఉంచుతారు. ఇలా చేస్తే ఇంట్లోకి అడుగుపెట్టగానే మీ కళ్లు నవ్వుతున్న బుద్ధుడిపై పడతాయి. ఇది ఇంటికి ఆనందం, అదృష్టం, ఆర్థిక లాభం తెస్తుందని నమ్ముతారు.

అక్వేరియం..ఇంట్లో చేపల అక్వేరియం ఉంటే డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. చేపల అక్వేరియం ఉంచడం కూడా వాస్తు శాస్త్రంలో శుభప్రదంగా పేర్కొనబడింది. మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మీ ఇంటికి ఫిష్ అక్వేరియం తీసుకురండి. ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం తొలగిపోతుంది. కానీ అక్వేరియంలో చేపల సంఖ్య కూడా చాలా ముఖ్యమైనది. గోల్డ్ ఫిష్ ఉంచడం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారని నమ్ముతారు.

మనీ ప్లాంట్..ఈ మొక్కను కుబేర మొక్క అంటారు. ఇది చాలా అన్ని చోట్లా చాలా ఫేమస్. చిన్న ఆకులు కలిగిన ఈ పచ్చటి మొక్క చాలా అదృష్టంగా భావిస్తారు. ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. ఈ మొక్క ఆక్సిజన్‌ను పెంచడమే కాకుండా ఆనందాన్ని వెదజల్లుతుందని నమ్మకం.

చైనీస్ నాణేలు..ఫెంగ్ షుయ్ శాస్త్రంలో చైనీస్ నాణేలు చాలా ముఖ్యమైనవి. ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో చుట్టి, వాటిని సురక్షితంగా ఉంచడం వల్ల పేదరికాన్ని దూరం చేయడమే కాదు.. ఆనందం, సంపద లభిస్తాయని నమ్ముతారు. వాటిని ఇంట్లో వేలాడదీయడం లేదా పజా గదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker