Health

మొలకెత్తిన గింజలు తింటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందా..? అసలు ఏంటంటే..?

మొల‌కెత్తిన గింజ‌లు శ‌రీరాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గి నిత్యం య‌వ్వ‌నంగా క‌నిపించవచ్చు. నిజానికి ఈ గింజ‌ల‌ను మొల‌కెత్తించిన‌ప్పుడు వాటిలో పోష‌క విలువ‌లు అధికశాతంలో పెరుగుతాయి. బరువు తగ్గాలని భావించే వారికి మొల‌కెత్తిన గింజ‌లు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. అయితే పోషకాహార నిపుణులు మొలకెత్తిన గింజలు తినడం మంచిదని చెబుతారు. వీటిని తినడం వల్ల మన ఆరోగ్య పోషణకు దోహదచేస్తాయి. వీటిని మన ఆహారంలో కలిపి తీసుకోవాలి.

విత్తనాన్ని మొలకెత్తిస్తే దానిలోని ఎంజైములు చైతన్యవంతమై ఎన్నో మార్పులను తీసుకువచ్చి గింజలోని పోషకాలు మన శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలోకి మార్చటమే గాక కొన్ని పోషకాలను సృష్టిస్తాయి. మన ఆహారంలో సాధారణంగా వాడే ధాన్యాలు, పప్పులను, మొలకెత్తిస్తే వాటిలోని పోషక విలువలు ఎక్కువగా వుంటాయి. పప్పులు, ధాన్యలలో మాంసకృత్తులు వుంటాయి. మొలకెత్తినప్పుడు నీటిలోని మాంసకృత్తులలో మార్పువచ్చి నాణ్యత పెరుగుతుంది. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా విభజంచబడి అత్యవసర ఆమైనో ఆమ్లాల నిష్పత్తిలో ఉపయోగకరమైన మార్పు వస్తుంది.

ఈ విధంగా మాంసకృత్తులు శరీరంలో సులభంగా జీర్ణమై శరీర పోషణకు తోడ్పడతాయి. అయితే మొలకెత్తిన గింజలు తింటే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందాని చాలా మందికి డౌట్​గా ఉంటుంది. కానీ సరైన మొతాదులో తీసుకుంటే మంచింది. లాభాలు..మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె లాంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. వీటి వల్ల పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని ద్వారా గుండె నొప్పిలాంటి సమస్యలు ఉండవు.

వాటిలో ఉండే ఫైటోఎరోజెన్ నిల్వలు, గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. మొలకెత్తిన గింజలు అధిక మొత్తాలలో సజీవ ఎంజైములను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను పెంచి శరీరంలోని రసాయనిక చర్యలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి.వాటిలో్ ఎంజైములు ఆహారంలోని పోషకాల శోషించేందుకు ఉపయోగపడుతాయి. మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచచ్చు. వాటిలో ఉండే విటమిన్లు,ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కావున మీ రోజువారి ఆహార ప్రణాళికలో మెులకెత్తిన గింజలను చేర్చండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker