తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బలగం మొగిలయ్య, ఆదుకోవాలంటూ కన్నీరు పెట్టుకున్న భార్య.
జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సని పని లేదు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే పాట ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు ఈ పాటను ఎంతో ఆర్ధతతో పాడారు. ఆ ఒక్క పాట వీరి జీవితాలను మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బలగం మొగిలయ్య మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
అయితే మొగిలయ్యకు కిడ్నీ, గుండె సంబంధింత వ్యాధులున్నాయి.కొన్ని నెలల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మెగాస్టార్ చిరంజీవి మొగిలయ్య చికిత్సకు సాయం చేశారు. ఇప్పుడు ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో మొగిలయ్య ఆసుపత్రిలో చేరారు. వైద్యానికి డబ్బులు లేక దీన స్థితిలో ఉన్నారు మొగిలయ్య దంపతులు.
ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో చికిత్స అనంతరం కోలుకున్న మొగిలయ్య.. ఇప్పుడు మరోసారి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించడం కోసం వరంగల్‌లోని సంరక్ష అనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొగిలయ్యకు కరోనా సమయంలో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నారు.
వైద్యం ఖర్చు ఎక్కువకావడంతో మొగిలయ్య దంపతులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయన భార్య ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మొగిలయ్య ఆరోగ్యం పై ఆయన భార్య మాట్లాడుతూ.. చికిత్సకు తమ వద్ద డబ్బులు లేవని.. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోరిరారు.
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన బలగం మొగిలయ్య
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2024
చికిత్సకు కూడా డబ్బులు లేని స్థితిలో ఉన్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య ఆవేదన pic.twitter.com/gftQzXt9LA