Health

ఈ చిన్న చిన్న జాగర్తలు పాటిస్తే చాలు సెల్‌ఫోన్ రేడియేష‌న్ నుంచి బయటపడొచ్చు.

మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా ప్రమాదం ఉంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. పిల్లలకైతే ఆన్ లైన్ తరగతులు ఇలా ప్రతి అవసరానికి సెల్‌ఫోన్ చాలా అవసరం.‘సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి మొబైల్స్‌ నుంచి వెలువడే రేడియేషన్‌ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే ప్రశ్న దశాబ్ద కాలంగా వినిపిస్తున్నదే. దీనికి స్పష్టమైన జవాబులు మాత్రం లేవు. సెల్‌ఫోన్‌ ముఖానికి దగ్గరగా ఉన్నప్పుడు మెదడు మీద దుష్ప్రభావాలు ఉంటాయని,

ప్యాంట్‌ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయనీ, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ.. రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఫోన్ల‌తో మ‌న‌కు ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని న‌ష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే న‌ష్టాల్లో ఒక‌టి రేడియేష‌న్‌. ఫోన్ల‌ను ఎంత ఎక్కువ‌గా వాడితే మ‌నం అంత ఎక్కువగా రేడియేష‌న్ బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఫోన్‌ను వీలైనంత వ‌ర‌కు మీ శ‌రీరానికి దూరంగా పెట్టుకోండి. ఆఫీసుల్లో గ‌న‌క మీరు ప‌నిచేస్తున్న‌ట్ల‌యితే ఫోన్‌ను డెస్క్‌పై ఉంచ‌డం ఉత్త‌మం.

అలాగే అవ‌స‌రం ఉంద‌నుకుంటేనే ఫోన్‌ను వాడండి. లేదంటే శ‌రీరానికి ఫోన్‌ను దూరంగానే ఉంచాలి. దీని వ‌ల్ల రేడియేష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. కొంద‌రు ఫోన్ల‌కు బ్లూటూత్ లేదా ఎన్ఎఫ్‌సీతో ప‌నిచేసే హెడ్‌సెట్ల‌ను వాడుతుంటారు. నిజానికి వాటితో కూడా రేడియేష‌న్ వ‌స్తుంది. క‌నుక వీలైనంత వ‌ర‌కు వైర్ ఉన్న ఇయ‌ర్ ఫోన్స్‌, హెడ్‌సెట్ల‌ను వాడ‌డం మంచిది. రేడియేషన్ బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. స్త్రీలు, పురుషులు ఎవ‌రైనా స‌రే.. ఫోన్ల‌ను శ‌రీరానికి త‌గిలేట్లు కాకుండా వాటిని ప్ర‌త్యేక ప‌ర్సుల‌లో పెట్టుకోవ‌డం ఉత్త‌మం.

జేబుల్లో కాకుండా ప‌ర్సుల్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల రేడియేష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. కొంద‌రు నిద్రించేట‌ప్పుడు త‌ల ద‌గ్గ‌రే ఫోన్ల‌ను పెట్టుకుంటారు. అలా చేయ‌రాదు. మీరు ఫోన్ వాడ‌క‌పోయినా స‌రే దాని నుంచి ఎంతో కొంత రేడియేషన్ వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఫోన్‌ను త‌ల ద‌గ్గ‌రే పెట్టుకుంటే దాన్నుంచి వ‌చ్చే రేడియేష‌న్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంది. సాధార‌ణంగా ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టి ఉంచిన‌ప్పుడు వాటి నుంచి అధిక మొత్తంలో రేడియేష‌న్ విడుద‌ల అవుతుంది. అలాంటి స‌మ‌యాల్లో ఫోన్ ను వాడాల్సి వ‌స్తే.. చార్జింగ్ తీసి వాడాలి.

చార్జింగ్ ఉంచి వాడితే రేడియేష‌న్ ఇంకా అధికంగా విడుద‌లై అది మ‌న శ‌రీరంపై ప్ర‌భావం చూపుతుంది. మార్కెట్ లో మ‌న‌కు యాంటీ రేడియేష‌న్ స్టిక్క‌ర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫోన్ల‌కు వెనుక భాగంలో అతికించ‌డం వ‌ల్ల రేడియేష‌న్ బారి నుంచి కొంత వ‌ర‌కు తప్పించుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను అస్స‌లు ఇవ్వ‌రాదు. ఇవ్వాల్సి వ‌స్తే ట్యాబ్ ఇవ్వండి. వాటిల్లో కూడా సిమ్ లేకుండా చేసి ఇస్తే మంచిది. ఇక గ‌ర్భిణీలు ఫోన్ల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే క‌డుపులో ఉన్న బిడ్డ‌పై రేడియేష‌న్ ప్ర‌భావం ప‌డుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker