News

తృటిలో ప్రమాదం పెను ప్రమాదం, జేబులో ఉండగానే పేలిన మొబైల్ ఫోన్.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారడంతో పాటు కొన్ని టీవీ ఛానెల్స్‌లో కూడా హల్‌చల్ చేస్తోంది. ఆ వ్యక్తి ఓ షాపులో కుర్చీపై కూర్చుని టీ, స్నాక్స్‌ తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా అతని చొక్కా జేబులో ఉంచిన మొబైల్ ఫోన్ శబ్దంతో పేలి మంటలు వ్యాపించింది. అయితే కేరళలోని త్రిసూర్‌లో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది.

త్రిసూర్‌లోని మరోటిచల్ ప్రాంతంలో 76 ఏళ్ల వృద్ధుడి చొక్కా జేబులో ఉంచిన మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పేలి మంటలు చెలరేగాయి. వృద్ధుడు ఓ దుకాణంలో టీ తాగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకస్మికంగా నిప్పంటుకోవడంతో ఆ పెద్ద మనిషి గాయపడకుండా తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగటం ఇది మూడోదిగా పోలీసులు వెల్లడించారు.

అయితే, ఇదంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా ఓ దాబాలో టీ తాగేందుకు వెళ్లిన వృద్ధుడు హాయిగా కూర్చుని ఉండటం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సమీపంలో ఒక యువకుడు వారికి టీ తయారు చేస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా పెద్దాయన జేబులో పెట్టుకున్న ఫోన్ పేలిపోయింది.

వెంటనే జేబులోంచి ఫోన్ తీసి యువకుడి సాయంతో బట్టలకు అంటుకున్న మంటలను ఆర్పేశాడు. దాంతో అదృష్టవశాత్తు అతడు ఎలాంటి గాయాలు లేకుండా తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, తాను..త్రిసూర్ పోస్టాఫీసు రోడ్డులోని ఓ దుకాణం నుంచి ఏడాది క్రితం వెయ్యి రూపాయలకు ఈ ఫోన్ కొన్నట్లు వృద్ధుడు చెప్పాడు. పేలింది సాధారణ కీప్యాడ్ ఫోన్. బ్యాటరీ చెడిపోవడం వల్లే ఫోన్ పేలిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే, జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిన సంఘటన సాధారణ విషయం కాదంటున్నారు పోలీసులు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చాలా చోట్ల కనిపించాయి. ఇందులో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. నెలలో మూడుసార్లు ఫోన్లు బ్లాస్ట్ అయ్యాయి. కేరళలో గత నెల రోజుల్లో మూడు ఫోన్‌ పేలుళ్లు జరిగాయి. కోజికోడ్ నగరంలో కూడా ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉంచిన ఫోన్‌లో పేలుడు సంభవించింది. దాంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker