Health

ఈ పొడిని వేడి పాలలో కలిపి తాగితే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ మొత్తం కరిగిపోతుంది.

మిరియాలు.. ఇవి జీర్ణం కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఆయుర్వేదంలో కృష్ణమరీచంగా పిలిచే మిరియాలు అద్భుతమైన వంటింటి ఔషధం. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. జీర్ణక్రియ చురుగ్గా సాగేందుకు తోడ్పడతాయి.

లాలాజలం ఊరేలా చేస్తాయి. ఉదరంలో పేరుకున్న వాయువును వెలుపలికి నెట్టివేసే శక్తి మిరియాల సొంతం. శరీరంలో రక్తప్రసరణా వేగవంతం అవుతుంది. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. వీటి వాడకం వల్ల శరీరంలో స్వేద ప్రక్రియ పెరుగుతుంది. మూత్రవిసర్జన సాఫీగా సాగుతుంది. కండర నొప్పులు దూరం… జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే… గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.

గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి. అయితే మీరు మీ ఆహారంలో వంటగదిలో సులభంగా లభించే వాటిని ఉపయోగిస్తే మీరు అనేక ప్రధాన వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. వంటగదిలో తేలికగా లభించే నల్ల మిరియాలు ఎన్నో లాభాలను అందిస్తుంది. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ ,బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.

చలి.. మిరియాలు వేడి పాలలో కలిపి తాగితే చలిలో ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా, తరచుగా జలుబు, తుమ్ములు నిరంతరం బాధిస్తే.. ఒకటి నుండి ప్రారంభించి మిరియాల సంఖ్యను పదిహేనుకు పెంచండి. ప్రతిరోజూ ఒకటి నుండి పదిహేను వరకు ఆహారంలో చేర్చుకుంటే జలుబు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

డీహైడ్రేషన్.. మీకు డీహైడ్రేషన్ సమస్య ఉంటే, మిరియాలు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఉండదు. అలసటగా కూడా అనిపించదు. దీనితో పాటు, చర్మం పొడిబారదు. మెదడుకు కూడా మేలు..నల్ల మిరియాలు మీ మెదడుకు కూడా ఉపయోగపడతాయని మీకు తెలుసా..? దీన్ని డైట్‌లో చేర్చుకుంటే మనసు కూడా తాజాగా ఉంటుంది. ఈరోజే మీ ఆహారంలో చేర్చుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker