మధ్యరాత్రిలో అకస్మాత్తుగా నిద్ర లేస్తున్నారా..? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా కూడా రాత్రి సమయంలో ఆకస్మిక మరణం పొందిన వారు కొన్ని వేల మంది ఉండి ఉంటారు.మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి మరణాలు గతంలో చాలా సంభవించాయి. అలాంటి మరణాలపై రీసెర్చ్ చేసిన ఒక వైధ్య బృందం చివరకు ఒక రిపోర్ట్‌ను తయారు చేయడం జరిగింది. అయితే సాధారణంగా రాత్రి 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంటుంది. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. మరికొందరిలో ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు.
నిద్రలో మేల్కోనే సమస్య ఉన్నవారు. నిద్రేంచే ప్రదేశంలో సరైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడు పదే పదే గడియారంలో సమయం చూసుకోకుండా అలాగే నిద్రపోండి. ఇలా చేయటంవల్ల ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో వచ్చే నిద్ర కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నించండి. బెడ్‌రూమ్‌లో సాధ్యమైనంత తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోండి. సులభంగా నిద్ర పడుతుంది. అప్పుడు మధ్యలో మెలకువ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఒకవేళ మీకు మధ్య రాత్రి మెలకువ వచ్చి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోతే. మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్ వినడమో లేదా పుస్తకం చదవడమో చేయాలి. దీంతో నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండుమూడు గంటలు హాయిగా నిద్రపోతారు. పగలంతా ఇలా హాయిగా నిద్రపోతే రాత్రి నిద్ర పట్టదు. కాబట్టి పగలు నిద్ర వద్దని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి చాలా రకాల ఒత్తిళ్లుంటాయి. మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తొచ్చి తిరిగి నిద్ర పట్టకపోవచ్చు.
కాబట్టి పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యల గురించి చర్చించకపోవడం మంచిది. ముఖ్యంగా ఆర్థరైటిస్, గుండె వైఫల్యం, క్యాన్సర్ వంటి సమస్యలు, ఉబ్బసం, బ్రోన్కైటిస్ లేదా మరొక ఊపిరితిత్తుల వ్యాధి నుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా, జీర్ణ సమస్యలు, ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ నుండి నొప్పి , మహిళలు తరచుగా వారి పీరియడ్స్ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల స్థాయిలు మారినప్పుడు రాత్రిపూట మేలుకువ వస్తుంది. ఇలాంటి సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. నిద్రకు ముందు దూమపానం, మద్యపానం, కాఫీ తాగటం వంటి అలవాట్లను నివారించటండి.