అర్థరాత్రి బిగ్ బాస్ హౌస్ లో దెయ్యం అరుపులు, బాత్రూంలో దాక్కున్న కంటెస్టెంట్స్.
రాత్రి పడుకునే సమయంలో విచిత్రమైన గొంతుతో భయానకంగా ఒక శబ్దం రావడంతో కంటెస్టెంట్స్ అందరూ బెదిరిపోతారు.. దానికి సంబంధించిన ప్రోమో ని విడుదల చెయ్యగా అది సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. అయితే రాత్రి సమయంలో బిగ్ బాస్ హౌజ్‌లో విచిత్రం చోటు చేసుకుంది.
శ్రీ సత్య తనకు సంబంధించిన గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ ఆ విషయాన్ని ఇతర సభ్యులతో రాత్రి రెండుగంటల సమయంలో షేర్ చేసుకుంటుంది. ఓ ఫ్రెండ్ రాత్రి సమయంలో నిద్రలో లేచి నడుస్తున్నాడని చెబుతున్న క్రమంలో గట్టిగా అరిచిన శబ్దం వచ్చింది. దీంతో అంతా ఒక్కసారిగా భయపడ్డారు.
అంతేకాదు శ్రీ సత్య వెళ్లి శ్రీహాన్ దుప్పట్లో దూరింది. శ్రీహాన్ భయబ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత మరోసారి శబ్దం రావడంతో అంతను రచ్చ రచ్చ చేశారు. శ్రీహాన్ బాగా భయపడిపోయాడా? లేక యాక్ట్ చేస్తున్నాడో గానీ మొత్తంగా బిక్కు బిక్కుమన్నట్టుగా వ్యవహరించారు. మరోవైపు ఇనయ కాసేపు దెయ్యం పట్టిన అమ్మాయిలా వ్యవహరించింది. తన బెడ్‌పై పడుకుని అరుపులు, గట్టిగా నవ్వుతూ భయటపెట్టించే ప్రయత్నం చేసింది.
ఆదిరెడ్డి టార్గెట్‌గా ఆమె దెయ్యంగా యాక్ట్ చేసింది. ఈ ఎపిసోడ్ హౌజ్‌లో నవ్వులు పూయించాయి. ఇలా సో సోగా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన టాస్క్ లేవి లేకపోవడంతో ప్రైజ్ మనీ రిటర్న్ పేరుతో బిగ్ బాస్ టైమ్ పాస్ చేస్తున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, ఇనయ, కీర్తి ఉన్నారు. శ్రీహాన్ ఆల్‌రెడీ ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.