మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అసలు విషయమేంటంటే..?
సాధారణ మనిషికి 7 గంటల నిద్ర సరిపోతుంది. అయితే కొంతమంది మధ్యాహ్నం పడుకొని రాత్రి లేట్ గా నిద్రపోతుంటారు. ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో తినడానికి సమయం దొరకడం కష్టంగా మారింది. దీనితో బాగా అలసిపోయి రాత్రి ఎక్కువగా నిద్ర పోతారు. అయితే మంచి ఆరోగ్యానికి కావల్సింది తిండి, నిద్ర, వ్యాయామం. అయితే మనలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారని ఒక అధ్యయనం ఫలితాలు వెలువరిస్తున్నాయి. నిద్ర సరిపడాలంటే రోజులో అప్పుడప్పుడు చిన్న కునుకేస్తుండాలని నిపుణులు చెబుతున్నారు.
కునుకు ఎంత సమయం పాటు ఉండాలి.. కొత్త అధ్యయనం ప్రకారం 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు కునుకు తీస్తే రెండు ప్రాణాంతక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం అరగంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు కునుకు తీసే వారిలో పోలిస్తే గుండె జబ్బులు, మధుమేహం వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అమెరికా పరిశోధకులు అంటున్నారు. మధ్యాహ్నం నిద్ర అలవాటులేనివారి కంటే ఎక్కువ ముప్పు వారికే ఉందని వెల్లడించారు. 30 నిమిషాల కంటే తక్కువ కునుకు తీయడమే బెటర్.. 30 నిమిషాల కంటే తక్కువ సేపు మధ్యాహ్నం కునుకు తీసే వారిలో బీపీ పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
స్లీప్ అండ్ సిర్కాడియన్ డిజార్డర్స్ విభాగం నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరు కునుకు తీసే సమయం, పరిస్థితులపై ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయట. అధ్యయనంలో భాగంగా 3,275 మందిలో నిద్ర ప్యాటర్న్ లను ఈ పరిశీలించారు. వీరిలో 30 నిమిషాల కంటే ఎక్కువ, 30 నిమిషాల కంటే తక్కువ కునుకు తీసేవారిని రెండు కేటగిరీలుగా విభజించారు. ఎక్కువ సేపు కునుకు తీస్తే ఏమవుతుంది.. ఎక్కువ సమయం పాటు నిద్రపోయ్యే వారు బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. మధ్యాహ్నం నిద్రపోని వారితో పోల్చితే కునుకు తీసే వారి నడుము చుట్టు కొలత ఎక్కువ ఉండటాన్ని పరిశోధకులు గమనించారు.
మధ్యాహ్నం కునుకు తీసేందుకు పెరిగే సమయం.. సాధారణంగా రాత్రి భోంచేసే సమయం, పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అలవాట్లు, నిద్రకు ఉపక్రమించే సమయం వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. యూనివర్సిటి ఆఫ్ వర్జీనియా నిపుణులు కూడా మధ్యాహ్నం ఎక్కువ సేపు నిద్ర పోవడం అనేది రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుందని చెబుతున్నారు. దీన్ని నివారించాలంటే తప్పకుండా రాత్రి సరిపడినంత నిద్ర పోవడం అవసరం. తప్పకుండా రాత్రి పూట తగిన సమయం నిద్రపోవాలి. ఇందుకు కావల్సిన కొన్ని చిట్కాలు కూడా సూచిస్తున్నారు నిపుణులు.
రిలాక్సయ్యేందుకు కొన్ని మార్గాలు.. పడుకోవడానికి బెడ్ రూమ్ కు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి. నెమ్మదిగా నాభి వరకు ఊపిరి తీసుకుని తర్వాత నెమ్మదిగా వదులుతూ శ్వాస మీద దృష్టి నిలిపితే నెమ్మదిగా నిద్రలోకి జారుకోవచ్చు. నెమ్మదిగా కాళ్లలోని కండరాలను, తర్వాత తొడలు, తర్వాత పొట్ట, తర్వాత వీపు, చెస్ట్ కండరాలను కంట్రాస్ట్ చేసి వదలడం వల్ల శరీరం రిలాక్సవుతుంది. అందువల్ల త్వరగా నిద్రపడుతుంది. రాత్రి భోజనం త్వరగా ముగించడం, నిద్ర సమయానికి గంట ముందు నుంచి గాడ్జెట్స్ వాడడం మానెయ్యడం వంటి చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడం సాధ్యపడుతుంది.