Health

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్రపోతున్నారా..? మీకు అసలు విషయం తెలిస్తే..?

మధ్యాహ్నం భోజనం కాగానే అందరూ ఆహారం జీర్ణం అవుతుందనే భావనలో నడవటం, మెట్లు ఎక్కడం దిగటం చేస్తూంటారు. కానీ.. అవి మంచిది కావు. పెద్దవారు, ఊబకాయం ఉన్నవారు ఇలా ఎక్కువగా చేస్తూంటారు. భోజనం అయ్యాక ఇంటి ఆవరణలోనే నాలుగు అడుగులు అటు ఇటూ వేయడం సరైనదే కానీ.. ఇలా ఎక్కువ దూరం నడవడం, ఆయాసపడుతూ మెట్లెక్కడం చేయడం మంచిది కాదంటున్నారు. అయితే సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా అవసరం.

మనిషికి తిండి, బట్టలు, ఇల్లు.. ఇలా ప్రాథమిక అవసరాలు ఎలాగో.. నిద్ర కూడా అలాంటిదే. రోజంతా రకరకాల పనులు చేసి, అలిసిపోయే శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండే ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. పెద్దవాళ్లు తప్పనిసరిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అయితే.. ప్రస్తుతం మారిపోయిన లైఫ్ స్టైల్ కారణంగా పని విధానాల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. షిఫ్టుల విధానంలో పని చేసే పరిస్థితులు తెలెత్తాయి. దీంతో రాత్రి వేళల్లోనూ పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇలా చేసుకుంటూ.. రాత్రి నిద్రపోవడమే గగనమైపోతోంది. ఫలితంగా పని సమయాల్లో కునుకు తీయడం, మత్తుగా అనిపించడం, నీరసం, అలసట.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నే ఉన్నాయి. చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రపోతుంటారు. అయితే.. అలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా.. కీడు జరుగుతుందా అనే విషయాలపై పరిశోధకులు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం 30 నుంచి 90 నిమిషాల మధ్యాహ్న నిద్రలో వృద్ధుల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇంద్రియ వ్యవస్థకు సున్నితత్వాన్ని తెస్తుంది. భయాందోళన ప్రతిచర్యలను నివారిస్తుంది. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. మానసిక లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శరీరం ఒక చిన్న విరామం కోరుకుంటుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల రిఫ్రెష్‌గా రోజుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కొంత విశ్రాంతి తర్వాత మెదడు రీ ఫ్రెష్ అవుతుంది. శరీరం రీఛార్జ్ అవుతుంది.

మరింత శక్తితో పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. మధ్యాహ్నం నిద్ర నష్టాలు..రాత్రి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి వైద్యులు సలహా ఇస్తారు. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే మధ్య వయస్కులు, వృద్ధ మహిళలు వరుసగా 39 శాతం, 54 శాతం అధిక రక్తపోటు కలిగి ఉంటారు. ముఖ్యంగా నిద్ర లేమితో బాధపడుతున్నట్లయితే మధ్యాహ్నం నిద్ర అనేది అందరికీ సరిపోదని గమనించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker