కాలికి మెట్టెలు పెట్టుకుంటే నిజంగానే గర్భం త్వరగా వస్తుందా..?
పెళ్లైన అమ్మాయిలు మెళ్లో మంగళసూత్రం, కాలికి మెట్టెలు పెట్టుకునే వారి సంఖ్య చాలా చాలా తక్కువ. సంప్రదాయ పెళ్లిలో ”స్థాలీపాకం” పేరుతో ఓ పద్ధతి ఫాలో అవుతారు. ఆ సమయంలో పెళ్లికూతురి కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు. అయితే మెట్టెలు తొడగడం వల్ల స్త్రీలలో గైనిక్ సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి. కాలి వేళ్ళలో ఉండే నరాలపై మెట్టలు పెట్టుకుని నడవడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది.
ఈ కారణంగా వారిలో కొన్ని నరాలు ఉత్తేజితమై గైనిక్ సమస్యల్ని దూరం చేస్తాయట. అంతే కాదు, వీటిని పెట్టుకోవడం వల్ల బాడీ సిస్టిమ్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వివాహమైన స్త్రీలు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు దూరమవుతాయట.. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చి మహిళల్లో రీ ప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది.
దీని కారణంగా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే వివాహమైన స్త్రీలు కచ్చితంగా వీటిని ధరించాలని వారు సూచిస్తున్నారు. గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు. స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా మెట్టెలు పెడతారు.. అయితే అందరికీ కాదు. సంతానలేమి సమస్య ఉన్న పురుషులకు కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు.
ఇలా ఒత్తిడి కలిగించడం వల్ల ఆ సమస్యలు నివారణ అవుతాయని నిపుణులు అంటున్నారు. పురుషుల కంటే స్త్రీలలో కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అప్పట్లోనే మహర్షులు కనుగొన్నారు. స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే వారి కోరికలు నియంత్రణలో ఉంటాయని పురాతన గ్రంధాలు చెబుతున్నాయి. ఇప్పుడు మెట్టెల్లో కూడా రకరకాల ఫ్యాషన్స్ వచ్చేశాయి. మార్కెట్ల్ వివిధ రకాల డిజైన్లలో మెట్టెలు ఉంటున్నాయి. వీటితో ఆడవారి అందం ఇంకాస్త రెట్టింపు అవుతుంది.