Life Style

గర్భంతో ఉన్న వారు వీటిని తినకపోవడమే మంచిది. ఒకవేళ తిన్నారో..?

మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసులు. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. అయితే గర్భిణీ స్త్రీలకు సురక్షితమైన మరియు అసురక్షిత ఆహారాలకు సంబంధించి అనేక అపోహలు ఉంటాయి.

అలాంటి వాటిలో గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడం సురక్షితమేనా అని చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటుంటారు. గర్భధారణ సమయంలో ఏమి తినాలి లేదా తినకూడదు అనే విషయంలో అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. మెతులు గర్భిణీ స్త్రీలకు ఒక మోస్తరు మొత్తాలలో తీసుకున్నప్పుడు మాత్రమే సురక్షితం. అధిక వినియోగం మాత్రం గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డెలివరీకి ముందు మెంతులు తీసుకోవడం వల్ల నవజాత శిశువు శరీరం వాసన వస్తుంది.

అధిక మొత్తంలో మెంతులు తీసుకోవడం వల్ల శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది, ఇది కొన్ని ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. మెంతులు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల విషయానికి వస్తే గర్భధారణ సమయంలో జీర్ణవ్యవస్థ సరిగా ఉండదు. మీరు రోజూ మెంతులు తింటే, అది వికారం లేదా వాంతులు మరియు యాసిడ్ అజీర్ణానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో కడుపు ఉబ్బరం లేదా అతిసారం కూడా కలిగిస్తుంది.

మెంతులు గర్భధారణ సమయంలో హైపర్సెన్సిటివ్ ప్రతిచర్యలకు కారణమవుతాయి. అందువల్ల, ఇది ముక్కు కారటం, వాపు, దగ్గు మరియు శ్వాసలో గురక వంటి సున్నితమైన ప్రతిస్పందనలకు దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మెంతులు తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో గర్భస్రావం కూడా కావచ్చు. కాబట్టి, గర్భం దాల్చిన 37 వారాల ముందు మెంతికూర వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెంతులు గర్భధారణ సమయంలో మీరు ఉపయోగించే మందుల ప్రభావాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలచబరిచే మందులతో కలిసినప్పుడు కొన్ని దుష్పప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు ఉంటే మెంతులను తీసుకోకపోవడమే మంచిది. ఆహారంలో లభించే దానికంటే ఎక్కువ మోతాదులో మెంతులు తీసుకోవడం వల్ల శిశువుకు పుట్టుకతో వచ్చే వైకల్యాల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మెంతులు అతిగా తీసుకోవడం వల్ల పై దుష్ప్రభావాలు కలుగుతాయి. పరిమితిగా తీసుకుంటే హానికరం కాదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker