Health

ఈ కాలంలో ఈ అకుకురని గుర్తుపెట్టుకొని మరి వైద్యులు తినమంటారు, ఎందుకో తెలుసా..?

మెంతి ఆకుల్లో ఉండే పోషకాలు గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆకుల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. మెంతిఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అయితే చలి వాతావరణం వల్ల శరీరం మెల్లగా ఉంటుంది. దీంతో తిన్న ఆహారమూ జీర్ణం కాదు.

ఇలాంటి ఆరోగ్య సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం మెంతి ఆకు. దీన్ని ఏ కాలంలో అయినా సరే ఎక్కువగా తినాల్సిందే. మరీ ముఖ్యంగా శీతాకాలంలో దీని వాడకాన్ని పెంచమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతి కూరలో పోషకాలు..మెంతి కూరలో ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాపర్లు ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, బీ, సీ, డీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టే వీటిని శీతాకాలంలో తరచుగా తినాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.

జీర్ణ క్రియ మెరుగవుతుంది..ఎక్కువగా బయటి ఆహారాలు తినేవారికి అజీర్తి, గ్యాస్, పొట్టలో ఉబ్బరం వంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఇవి మరీ ఎక్కువ అవుతాయి. అలాంటి వారు వారానికి రెండుసార్లు మెంతి కూర తినాలి. చిన్నగా, చేదుగా ఉండే ఈ ఆకులు జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, కడ‌ుపు నొప్పి, మల బద్ధకం సమస్యలకు చెక్ పెడతాయి. జీవ క్రియ మెరుగవుతుంది..ఈ మధ్య కాలంలో ఊబకాయం, దాని వల్ల వచ్చే సమస్యలు పెరిగిపోతున్నాయి.

పెరిగినంత తేలికగా తగ్గడం మాత్రం చాలా కష్టం. ఇలా బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్న వారు కచ్చితంగా మెంతి కూర తినాలి. ఈ ఆకులు కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం జీవ క్రియను పెంచుతుంది. అందువల్ల క్యాలరీలు కరుగుతాయి. దీంతో బరువు తగ్గుతాం అన్న మాట. ఇన్సులిన్‌ తగినంత ఉత్పత్తి అవుతుంది.. మెంతి ఆకుల్లో ఉండే అమైనో యాసిడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహకరిస్తాయి. అందువల్ల టైప్ 2 డయాబెటిస్‌ రాకుండా ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

ఇన్సులిన్‌ తగినంతగా ఉత్పత్తి కాకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మధుమేహానికి కారణం అవుతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కొలెస్ట్రాల్ తగ్గుతుంది..గుండె జబ్బులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. ఇది ధమనుల్లో చేరి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. అందువల్ల హార్ట్ ఎటాక్ లాంటివి వస్తాయి. మెంతి ఆకుల్ని తరచుగా తప్పకుండా తింటూ ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker