ఈ కాలంలో ఈ ఆకుకూర తింటే.. ఆ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!
మెంతి గింజలు అనేక ప్రయోజనాలు అందిస్తాయని అందరికి తెలిసిన విషయమే. వీటితోపాటు.. మెంతి ఆకులు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహయపడతాయి. ఇందులో ఐరన్, సెలీనియం, కాల్షియం, మాంగనీస్, మినరల్స్, జింక్ వంటి పోషకాలున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలను తగ్గించడంలోఎక్కువగా సహాయపడతాయి. అయితే చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరానికి ఉష్ణోగ్రత అందించే ఆహారాన్ని తింటూ ఉండాలి. అలా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే ఆహారాల్లో మెంతి ఆకు కూడా ఒకటి. ఎంతోమంది మెంతాకు తినడానికి ఇష్టపడరు.
ఒకవేళ తిన్నా కూడా నెలకి ఒకటో రెండో సార్లు తింటారు. కానీ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచాలంటే మెంతాకును వారానికి కనీసం మూడు నాలుగు సార్లు తినాలి. మెంతికూరతో ఎన్నో టేస్టీ వంటకాలు వండుకోవచ్చు. కాబట్టి మెంతి ఆకును తినేందుకు ప్రయత్నించండి. చలికాలంలో ప్రతి ఒక్కరి రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. శరీరంలో వెచ్చదనం తగ్గిపోవడం కూడా రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణంగా చెబుతారు. మెంతికూరను తినడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
రోగనిరోధక శక్తి పెరగడానికి కావాల్సిన ఉష్ణోగ్రతను మెంతి ఆకు అందిస్తుంది. ఈ ఆకులను తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి తరచూ దాడి చేయకుండా ఉంటాయి. ఈ మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్లు, వైరస్ బారిన పడకుండా కాపాడతాయి. చలికాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా పనిచేస్తుంది. జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు బలాన్ని అందించడంలో మెంతాకు మొదటి స్థానంలో ఉంటుంది.
జీవ క్రియల రేటును పెంచుతుంది. అజీర్తి వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. మధుమేహం ఉన్నవారు మెంతికూరను కచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. మహిళలు కూడా మెంతాకు తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెంతులతో టీ చేసుకుని తాగితే హార్మోన్ల అసమతుల్యత రాకుండా ఉంటాయి. పురుషులు మెంతాకును తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
ఎలాంటి లైంగిక సమస్యలు రావు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మెంతికూరతో ఏం వండుకోవాలి అని ఆలోచించొద్దు. పప్పు మెంతాకు, ఆలు మెంతికూర, మెంతాకు రైస్ ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి ఇవన్నీ. మెంతాకులను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మెంతులను మట్టిలో వేస్తే చాలు మెంతి మొక్కలు మొలుస్తాయి. వాటిని తాజాగా వండుకుంటే రుచి కూడా అదిరిపోతుంది.. వీటిని పెంచడం కూడా చాలా సులువు.