మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే ఎంత ప్రమాదంలో ఉన్నట్లో తెలుసా..?
ఈ రోజుల్లో పురుషులలో అతిపెద్ద ప్రమాదం గుండె జబ్బులు. చిన్న వయసులోనే గుండెపోటు రావడంతో చాలామంది చనిపోతున్నారు. అలాగే హైబీపీ సమస్య సర్వసాధారణమైపోతోంది. దీని వల్ల గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతోంది. ఈ పరిస్థితిలో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. ఇందుకోసం రోజూ ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొంతకాలం కిందట 60 ఏళ్లు దాటిన వారిలో నే అనారోగ్య సమస్యలు వచ్చేవి.
ఆందోళన, ఒత్తిడి .. ఇతర వ్యాధుల మాదిరిగానే డిప్రెషన్ ఆందోళన లాంటి మానసిక వ్యాధులు కూడా వస్తున్నాయి.. పని ఒత్తిడి లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఇబ్బందులు కావచ్చు. ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. దీని కారణంగా మగవారిలో ఆందోళన గురవుతున్నారు. ఇది శారీరిక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైంది. ఈ నేపథ్యంలో పురుషులు తమ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చిన్న వయసు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రధానంగా మగవారిలో ఎక్కువ రోగాలు బారిన పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు ఆఫీస్ పనులు ఇతర పనుల వలన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా 30 ఏళ్లు దాటిన మగవారు ఎక్కువ వ్యాధుల బారిన పడుతున్నారు. గుండె జబ్బులు.. ఇప్పుడున్న కాలంలో ప్రజలను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య గుండె సమస్య.
చిన్న వయసులోని ఎంతో మంది గుండె జబ్బుల వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. దీనికోసం రోజు మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం సరైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం వలన గుండె జబ్బులు సమస్యలు తగ్గిపోతాయి. షుగర్.. షుగర్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. ప్రపంచంలో మధుమేహం బాధితుల సంఖ్య 90 మిలియన్లు దాటింది సరైన జీవనశెలి జన్యుపరమైన కారణాలు వలన ఈ వ్యాధి సంభవిస్తుంది.
ఇప్పుడున్న కాలంలో 30 సంవత్సరాల వయసు తరువాత మగవారిలో మధుమేహ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇది ప్రాణాంతకం కాకముందే వైద్య నిపుణులు సంప్రదించాలి. ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన లాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య నిపుణుని సంప్రదించాలి. లేకపోతే డేంజర్ లో పడడం ఖాయం.