కేవలం మగవారికే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే. వాటి నుంచి బయటపడాలంటే..?
చాలా మంది పురుష మహానుభావులు శుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది పురుషులు తమ వ్యక్తిగత పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోరని కొన్ని డిజిటల్ రిపోర్టుల్లో పేర్కొన్న డేటా ప్రకారం ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో లైంగిక అనారోగ్యం, ఫిట్‌నెస్ దెబ్బతినడం వారి వ్యక్తిగత అపరిశుభ్ర జీవనశైలే కారణం అని చెబుతున్నారు. పురుషులు తమకోసం తాము సమయం కేటాయించుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తించాలి. వ్యక్తిగత పరిశుభ్రత వలె సన్నిహిత పరిశుభ్రతకూ ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచిస్తున్నారు.
అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా స్త్రీల కంటే పురుషులే తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ వహిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. 40 సంవత్సరాలు పైబడిన వారు కడుపు ఉబ్బరం, స్థూలకాయం సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. మగవారు స్మోకింగ్ చేసే అలవాటును మానుకుంటే మంచిది.
లేకపోతే ప్రొటెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు పురుషులు ఎక్కువగా ఫేస్ చేసే అనారోగ్య సమస్యలు. వీటన్నింటినీ క్రమం తప్పకుండా చెకప్ చేయించుకునే అలవాటు చేసుకోవాలి. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది.
గుండెపోటు స్ట్రోక్, కార్డియారిక్ అరెస్ట్ వంటి రోగాలు ఊహించిన విధంగా ప్రాణాలను తీస్తాయి. గుండె జబ్బులు, స్ట్రోక్లు ఆడవారితో పోలిస్తే మగవారికి ఎక్కువగా వస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎముక అరుగుదల లేదా బోలు ఎముకల వ్యాధిని భారీన పడే అవకాశం పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అందుకని కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చాలామంది మగవారు మానసిక ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు.
నిరాశ , ఒత్తిడి, ఆందోళన, విసుగు వంటి సమస్యలు పెద్దవాళ్ళులో ఎక్కువగా కనిపిస్తాయి. పురుషులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే బీపీ, గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. సకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తింటూ , కంటి నిండా నిద్రపోతూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.