తలస్నానం చేసేటప్పుడు పురుషులు చేస్తున్న తప్పులు ఇవే, దాని వల్లే ఆ సమస్య కూడా..!
తలస్నానం చేస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో చేసే తలస్నానం శుభాలను కలిగిస్తే.. కొన్ని రోజుల్లో చేస్తే తీవ్ర నష్టాలను కలిగిస్తుందని పురోహితులు చెబుతున్నారు. అయితే జుట్టు అందంగా, నల్లగా, ఒత్తుగా ఉండాలని స్త్రీలే కాదు పురుషులు కూడా కోరుకుంటారు.
ప్రతి మనిషి శారీరక సౌందర్యంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, నల్లగా, మెరిసేలా , చక్కగా స్టైల్‌గా ఉండాలని కోరుకుంటారు. ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు వ్యక్తి విశ్వాసాన్ని పెంచుతుంది. వారిని ఆకర్షణీయంగా చేస్తుంది.
కాబట్టి జుట్టు సంరక్షణ కోసం స్త్రీలే కాదు పురుషులు కూడా ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తలస్నానం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల వల్ల జుట్టు రాలే సమస్య ఎదురవుతోంది.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే పురుషులు స్నానం చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీరు లేదా చల్లటి నీటితో మీ జుట్టును సరిగ్గా తడి చేయండి. అలాంటప్పుడు నేరుగా జుట్టుకు ఎక్కువ షాంపూ రాయకండి.
ఇది జుట్టును బలహీనపరుస్తుంది. ప్రతిరోజూ తల స్నానం చేసే బదులు, వారానికి ఒకసారి లేదా రెండు రోజులు మీ జుట్టును కడగవచ్చు.