పురుషులు ఈ అలవాట్లు మానకుంటే తండ్రికావడం కష్టం. ఆ అలవాట్లు ఏంటంటే..?
గడిచిన 45 ఏళ్లలో పురుషుల్లో స్పెర్మ్‌కౌంట్ 51.6 శాతం మేర తగ్గినట్టు ఇటీవల హ్యూమన్ రీప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తేల్చింది. జీవన శైలి ఎంపికలు, పర్యావరణంలోని హానికరమైన రసాయనాల వల్లే ఈ పరిస్థితి ఎదురైందని అధ్యయన విశ్లేషించింది. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలని నొక్కొచెప్పింది.
అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చెడు వ్యసనాల వల్ల చాలామంది పురుషులు అనారోగ్యానికి గురవుతున్నారు. మగవారు వివాహం తర్వాత తండ్రి కావాలని కోరుకుంటారు. కానీ చెడ్డ అలవాట్ల వల్ల ఈ కోరిక నెరవేరడం లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు తక్కువ టెస్టోస్టెరాన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ దీని గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇబ్బందిపడుతున్నారు.
అనారోగ్యకరమైన ఆహారం చాలామంది పురుషులు ఉద్యోగరీత్యా బయటి ఆహారమే ఎక్కువగా తింటారు. ముఖ్యంగా నూనెతో చేసిన జిడ్డు ఆహారాలు, తీపి ఆహారాల వైపు మొగ్గుచూపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. దీంతో తక్కువ టెస్టోస్టెరాన్‌ను సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఇంటి భోజనం తినాలి. బయటి ఆహారాని దూరంగా ఉండాలి. నిద్ర లేకపోవడం చాలా మంది ఆరోగ్య నిపుణులు ఆరోగ్యవంతమైన పెద్దలు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని చెబుతారు.
కానీ నేటి వేగవంతమైన జీవితం, కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి కారణంగా భారతీయ పురుషులు తగినంత నిద్ర పోవడంలేదు. దీనివల్ల టెస్టోస్టెరాన్ లోపం ఏర్పడుతుంది. ఊబకాయం ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు. కానీ ఇది ఖచ్చితంగా అనేక వ్యాధులకు కారణమవుతుంది. దీని కారణంగా అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి.
అలాగే ఇది పురుషుల సంతానోత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది టెస్టోస్టెరాన్ తగ్గడానికి దారితీస్తుంది. అనారోగ్య జీవనశైలి అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల వృద్ధాప్యం లక్షణాలు తొందరగా వస్తాయి. ఇలాంటి వ్యక్తులు వారి వయసు కంటే ముందుగానే వృద్దాప్యానికి గురవుతారు. ఇది టెస్టోస్టెరాన్ లోపానికి దారితీస్తుంది. కాబట్టి అకాల వృద్ధాప్యం రానివ్వకూండా చూసుకోవాలి. ప్రతిరోజు కచ్చితమైన డైట్ పాటించాలి. చెడు వ్యసనాలని వదిలేయాలి.