Health

ఈ డ్రింక్ తాగితే పురుషులు బెడ్ రూమ్ లో రెచ్చిపోవడం గ్యారెంటీ.

గుండె జబ్బుల నుంచి ఎముకల వరకు.. మితంగా వైన్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. మితంగా వినియోగించినప్పుడు వైన్ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని.. కానీ అమితంగా తీసుకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే రెడ్ వైన్ పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు, గతంలో జరిపిన పరిశోధనల్లో కూడా ఇదే విషయం తేలింది.

రెడ్ వైన్ పురుషులకు అమృతంలా పనిచేస్తుందని, పడక గదిలో పార్టనర్‌తో ఏర్పడే సమస్యల నుంచి గట్టెక్కిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇందుకు కారణాలను కూడా వెల్లడించారు. రెడ్ వైన్‌లో ఉండే పోలీఫోనాల్స్ రసాయనం మగాళ్లకు లైంగిక శక్తిని అందిస్తుందని తెలిసింది. అంతేకాదు, మహిళల్లో కోరికలను పెంచేది కూడా అదేనట. గత 30 ఏళ్లుగా దీనిపై జరుగుతోన్న పరిశోధనలు రివ్యూ చేసిన నిపుణులు.. ఈ విషయాన్ని ధృవీకరించారు. రెడ్ వైన్ కోరికలను ప్రేరేపించడమే కాకుండా, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందట.

అలాగే, పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలను పెంచి.. సంతానోత్పత్తికి సహకరిస్తుందట. పోలీపోనాల్స్ అనేవి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు.. అవి గుండె, రక్త నాళాల్లో అంతర్గత మార్గాలను సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తాయి. దానివల్ల శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. చివరికి మర్మాంగాల వద్ద కూడా రక్త ప్రవాహం పెరగడం వల్ల కోరికలు పెరగడమే కాకుండా.. పురుషుల్లో లైంగిక ప్రేరణ కలుగుతుంది. దానివల్ల బెడ్ మీద ఎక్కువ సేపు పార్టనర్‌తో కలయికలో పాల్గొనవచ్చు.

ఇటలీకి చెందిన పరిశోధకులు.. సాధారణ మహిళలతో పోల్చితే, రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగే మహిళల్లో లైంగిక కోరికలు ఎక్కువని పేర్కొన్నారు. ముఖ్యంగా వయస్సు మీద పడుతున్న మహిళలకు ఈ రెడ్ వైన్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇందుకు రెడ్ వైన్‌లో ఉండే ఆల్కహాల్, పోలీఫోనాల్స్ కారణమని వెల్లడించారు. అవి వారిలో ఉద్వేగానికి కారణమవుతాయని తెలిపారు. అప్పుడప్పుడు మద్యం తాగేవారు, వైట్ వైన్ తాగేవారిలో కూడా ఈ ప్రేరణ ఉంటుందన్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker