News

ముఖంపై సూదులతో ఈ స్టార్ హీరోయిన్ ఎలా మరిపాయిందో చుడండి.

మెహ్రీన్.. న్యాచురల్ స్టార్ నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసు దొచుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా తర్వాత మెహ్రీన్ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు.

అయితే ఇక మారుతి అయితే మహానుభావుడు, మంచి రోజులొచ్చాయ్ అంటూ ఆఫర్లు ఇచ్చాడు. మొత్తానికి మెహ్రీన్ మాత్రం అలా కాలాన్ని నెట్టుకొస్తుంది. ఇక ఆ మధ్య మెహ్రీన్ పెళ్లి వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసింది. కాబోయే భర్త గురించి కూడా చెప్పింది. కానీ చివరకు పెళ్లి మాత్రం పెటాకులైంది. మధ్యలోనే పెళ్లిని బ్రేక్ చేసింది మెహ్రీన్.

ఇప్పుడు మెహ్రీన్ మాత్రం తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో మెహ్రీన్‌ ఇలా మొహానికి చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చైనీస్ శాస్త్రియ వైద్య పద్దతైన ఆక్యూపంక్చర్‌ను మెహ్రీన్ ఎంచుకుంది. మ్యాజిక్ విత్ నీడిల్స్.. ఇదో అద్భుతమైన పనితనం.. ఆక్యూస్కిన్ లిఫ్ట్ మెథడ్ అంటూ తను చేయించుకుంటున్న చికిత్స పేరు చెప్పింది.

ఈ చికిత్స అయిన తరువాత తాను దుబాయ్ లేదా లండన్‌కు వెళ్లేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ చికిత్స మీద మాత్రం పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. మెహ్రీన్‌కు ఏమైంది? ఇందుకు ఇలా చికిత్స తీసుకుంటోందంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మెహ్రీన్ చేతిలో అయితే ఇప్పుడు ఏ ప్రాజెక్టులు లేనట్టుగా కనిపిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker