గుట్టుగా పెళ్లి చేసుకున్న కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్, వరుడెవరంటే..?
‘ముదల్ నీ ముడివుం’ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మీతా రఘునాథ్. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో కుర్రాళ్ల మనసులను దోచుకుంది. ఇక గతేడాది విడుదలైన గుడ్ నైట్ సినిమా అయితే మీతాకు ఎనలేని క్రేజ్ ను తీసుకొచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా రిలీజైంది.
అచ్చెం పక్కింటమ్మాయిలా కనిపించి తెలుగు అబ్బాయిల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఆమె మాత్రం పెళ్లి పీటలు ఎక్కి మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసేసారు. గత ఏడాది నవంబర్ లో ఈమె ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవి చూసి ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు.
కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో.. మీతా పెళ్ళికి సిద్దమైందేంటి అంటూ ప్రశ్నలు వేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈమె ఏడడుగులు కూడా వేసేసారు. మీతా రఘునాథ్ సైలెంట్ గా తన పెళ్లి వేడుకను పూర్తీ చేసేసుకున్నారు. ఈ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలను మీతా తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
‘నా నిండు హృదయం’ అంటూ ఫోటోలను షేర్ చేసారు. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్.. కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే మీతా ఫ్యాన్స్ మాత్రం.. ఆమె ఇక నటించదా అంటూ బాధ వ్యక్తం చేస్తున్నారు.