News

చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ కావడానికి కారణాలు ఇవే, దాని వల్ల ఎంత ప్రమాదమో తెలుసా..?

ఒకప్పుడు ఆడపిల్లలు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి రజస్వల అయితే ఇప్పుడు పన్నెండు పదమూడు ఏళ్ళకే అవుతున్నారు. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా కనపడుతోంది. ఇంకా చిన్నప్పుడే మెచ్యూర్ అవ్వడం ఎమోషనల్‌గా ఇబ్బంది పెడుతుంది. తరువాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అయితే గతంలో 15 సంవత్సరాల వయసులో అంటే యుక్తవయసులో తమ మొదటి రజస్వలను పొందేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పదేళ్లు.. లేదా పదేళ్ల లోపు కూడా ఆడపిల్లలు తమ మొదటి పీరియడ్స్​ను పొందుతున్నారు. ప్రస్తుత కాలంలో బాలికలు తమ మొదటి పీరియడ్స్​ను చాలా ముందుగానే పొందుతున్నారు. ముందుతరం వారితో పోలిస్తే.. ఈ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ముందుతరం వారికి.. ఇప్పటివారికి దాదాపు 5 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

యుక్తవయసు రాకమునుపే ఈ విషయంపై యూఎస్​లో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ స్టడీలో వారు షాకింగ్ విషయాలు గుర్తించారు. ఐదేళ్లలోపు వారు కూడా అయిపోతున్నారు..యూఎస్​లోని బాలికలపై చేసిన ఈ స్టడీలో నిపుణులు కొన్ని విషయాలు గుర్తించారు. పిల్లలపై ఆర్థిక నేపథ్యం నుంచి దాదాపు ప్రతి అంశం వారిని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. దీనిలో షాకింగ్ విషయం ఏమిటంటే.. కొందరిలో 5 సంవత్సరాల వయసు లోపు వారు కూడా తమ రజస్వలను పొందుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పదేళ్ల లోపు రజస్వలకు అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. కేవలం ఆర్థిక అంశాలే కాకుండా శారీరక అంశాలు కూడా వారిపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపారు. అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం కూడా బాలికల రజస్వలపై ప్రభావం చూపిస్తున్నాయని గుర్తించారు.

అంతేకాకుండా స్క్రీన్ సమయం కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. స్క్రీన్​ను ఎక్కువగా చూసే బాలికల్లో యుక్తవయసు త్వరగా ప్రారంభమవుతుందని.. ఇవి తమ మొదటి పీరియడ్స్​ను ప్రేరేపిస్తూ ప్రమాదకరంగా మారుతున్నాయని వెల్లడించారు. చిన్న వయసులోనే అధిక బరువు ఉండటం వల్ల కూడా త్వరగా పెద్దమనిషి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. బాలికల్లో ఎర్లీ పీరియడ్స్​కు పరిసర ప్రాంతాలు కూడా ఓ కారణమవుతున్నాయంటున్నారు. విషపూరితమైన, కాలుష్యం అధికంగా ఉండే గాలిని పీల్చుకోవడం బాలికలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నాయి. ఇవే కాకుండా పర్యావరణ కారకాలు, ఒత్తిడి, కొన్ని రకాల రసాయనాలు, లైంగిక హార్మోన్లు ప్రేరేపించే విషయాలు పిల్లల్లో రజస్వలకు కారణమవుతున్నాయి. అయితే ఈ కారణాలన్నీ కేవలం రజస్వల పైనే కాకుండా వారిలో లైంగిక కోరికలు పెరగడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయట.

యుక్తవయసు కంటే ముందుగానే రుతుక్రమం ప్రారంభమైతే.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు అంటున్నారు. పునరుత్పత్తి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, జీవక్రియ రుగ్మతలు, లైంగిక సమస్యలు ఇబ్బంది పెడతాయంటున్నారు. ఇవన్నీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటున్నాయని తెలిపారు. సంతానోత్పత్తి కూడా తక్కువగా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు కూడా రావొచ్చని చెప్తున్నారు. కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా వారిని ఇబ్బంది పెడతాయంటున్నారు. నిరాశ, ఆత్మ విశ్వాసం లేకపోవడం వంటి ప్రమాదకరమైన మానసిక సమస్యలు ఉంటాయని స్టడీలో తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker