ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నందమూరి హీరో మాస్ వార్నింగ్..! నా బొచ్చు కూడా పీకలేరంటూ…!
గత కొంతకాలంగా ఎన్టీఆర్ ఫ్యామిలీకి జూ ఎన్టీఆర్‌కి మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా సందర్భాల్లో ఈ విషయం తెర మీదకి వచ్చింది. జూ ఎన్టీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలను అర్జెంట్‌గా ఇక్కడి నుంచి పీకి పారేయండి అంటూ ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర బాలకృష్ణ అప్పట్లో చెప్పిన వీడియో కూడా తెగ వైరల్ అయింది. అయితే నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ చాలా కాలం క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గత ఏడాది బ్రీత్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే తెలుగుదేశం గెలవాలని సోషల్ మీడియా వేదికగా గతంలో పోస్టులు పెడుతూ వచ్చిన ఆయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది.
వైసీపీకి సపోర్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఇదే వార్నింగ్, ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ. మీరు సపోర్ట్ చేశారు అంటున్నారు, అయినా సరే మీరెవరో మా బొ* కూడా పీకలేరు. నేనుండగా మా చంద్రబాబు నాయుడు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్ ని టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు, జాగ్రత్తగా ఉండండి అంటూ తన ఫేస్ బుక్ పేజ్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు.
అయితే ఈ పోస్ట్ మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. మరోపక్క నందమూరి అభిమానులు మాత్రం వెరీ గుడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టిడిపి ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.