ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి పీఠలెక్కబోతున్నాడోచ్..! క్లారిటీ ఇచ్చిన శ్యామలా దేవి. అమ్మాయి ఎవరో తెలిస్తే..?
రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి అతని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. గతేడాది అతని పెళ్లవడం ఖాయం అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొందరైతే ప్రభాస్ కు ఇక పెళ్లి జరగదని కూడా అన్నారు. బాహుబలి తర్వాత అతడు మళ్లీ సక్సెస్ చూడడని కూడా చెప్పారు. కానీ సలార్, కల్కి 2898 ఏడీతో అది తప్పని నిరూపించాడు. అయితే ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఎంత సేపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌కు, ఆడియెన్స్‌కు ఎంటర్‌టైనమెంట్ అందించాలనే కానీ.. పెళ్లి చేసుకుందాం అనే థాట్ కూడా రావడం లేదని పలువురు డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో కూడా ఉన్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు సైతం తను ఉన్నన్ని రోజులు ప్రభాస్ పెళ్లి గురించే ఆలోచించేవాడట. ఘనంగా పెళ్లి చేయాలని అనుకునేవాడట. కానీ.. ఆ ముచ్చట తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కాగా తాజాగా ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి క్లారిటీ వచ్చింది. మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో కల్కీతో రుజువైందని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి తెలిపింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు హిట్టు ఉండదని కొందరు అన్నారని, కానీ.. వారి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రభాస్ హిట్లు కొట్టాడని తెలిపింది.
పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్ ఎంతగానో శ్రమిస్తున్నాడని, పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన ఆశించినవన్నీ జరిగాయి. పెళ్లి కూడా జరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నంత హ్యాపీగా ఎవరు లేరేమో.
సలార్, కల్కీ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా రిలీజైన కల్కీ మాత్రం మాములుగా ఊపడం లేదు. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. అన్ని వుడ్‌లలో రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటికే రూ.800 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా మరో రెండు, మూడు రోజుల్లో రూ.1000 కోట్ల మార్కు అందుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.