Health

30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం. అయితే పెళ్లి అనేది రెండక్షరాల మాటే కాని ఎన్నో భావాలు కలగలసిన అనుబంధం.

పెళ్లితో రెండు కుంటుంబాలు ఒకటవుతాయి. రెండు మనసులు జీవిత కాలం కలిసి నడిచేందుకు అవసరమైన వేదిక. దీంతో వివాహం మీద చాలా మందికి చాలా రకాల భావాలు ఉంటాయి. అందమైన కలలు వస్తాయి. జీవితాంతం ఎదురు చూసే అందమైన ఘట్టమే పెళ్లి. పెళ్లి తరువాత అన్ని మారుతాయి. బంధాలు, బంధుత్వాలు, మనసులు అన్ని కలుపుకుని జీవితాన్ని ఓ స్వర్ణమయంగా చేసుకునే కార్యక్రమమే పెళ్లి. అయితే ఇటీవల కాలంలో పెళ్లిని చాలా మంది వాయిదా వేస్తున్నారు. దీంతో అనేక అనర్థాలకు కారణమవుతున్నారు.

లేటు వయసులో.. ఆకలి అంత పోయినాక అన్నమెందుకు.. ఈడంత పోయినాక పెళ్లెందుకు అనేది సామెత. ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. దానికో పరమార్థం ఉంటుంది. మనం చేసే పనికి అర్థం ఉంటుంది. నువ్వు ఎక్కే రైలు జీవిత కాలం లేటు అన్నట్లు మనం లేటు వయసులో పెళ్లి చేసుకుంటే పలు సమస్యలకు కేంద్రంగా నిలవడం ఖాయం. దీని వల్ల భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పెళ్లి పాతికేళ్లకే చేసుకోవడం సమంజసం. కెరీర్ ను మెరుగుపరుచుకునే.. ఇటీవల కాలంలో అందరికి ఉద్యోగ బాధ్యతలు పెరిగాయి. ప్రతి వారు తమ ఉద్యోగాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో కెరీర్ పైనే దృష్టి సారిస్తున్నారు.

జీవితంలో స్థిరపడాలంటే కెరీర్ కూడా ముఖ్యమే. అందుకే పెళ్లి కంటే కెరీర్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా పెళ్లి వయసు దాటిపోతున్నా లెక్క చేయడం లేదు. వివాహ వయసు దాటాక పెళ్లి చేసుకుని కొత్తగా కష్టాల్లో పడుతున్నారు. సంసారాన్ని రచ్చ చేసుకుంటూ విడాకుల వరకు వెళ్లిన వారు సైతం ఉంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మనం పాతికేళ్లకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు రావడం కరెక్టు. అపార్థాలకు ఆస్కారం.. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే నష్టాల్లో అపార్థాలు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామిపై అనుమానాలు, అపార్థాలు ఏర్పడతాయి. ఈ గొడవలు ముదిరితే విడాకుల వరకు వెళ్లే అవకాశాలు కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు సమన్వయం పాటిస్తే గొడవలు లేకుండా ఉంటాయి.

ఇద్దరిలో సహనం కోల్పోతే మాత్రం వివాదాలు చోటుచేసుకోవడం ఖాయం. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటేనే కాపురం సాధ్యమవుతుంది. ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి అని చెబుతుంటారు. ఇది అక్షరాల సత్యం. డబ్బు సంపాదనపై..వివాహం ఆలస్యం కావడంతో డబ్బు సంపాదించాలనే యావలోనే ఉంటారు. జీవితంలో ఎదగాలనే ఉద్దేశంతో బాగా డబ్బు సంపాదించి స్థిరపడాలనే కోరికతో ఏది పట్టించుకోకుండా ముందుకు వెళతారు. అందుకే భార్యాభర్తల్లో ఎడమొహం పెడమొహం పెట్టడానికి అవకాశాలుంటాయి. ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గి అనుమానాలకు కేంద్రంగా మారుతుంది. అది ఎక్కువైతే ఇబ్బందులే. దీంతో సంసార జీవితం సాఫీగా జరగడానికి డబ్బు సంపాదన ఒకటే కాదు జీవితాన్ని ఆస్వాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయనే విషయం గ్రహించుకుని మసలుకుంటే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker