ఎట్టకేలకు పెళ్లికి రెడీ అయిన విజయ్, రష్మిక. ముహూర్తం ఎప్పుడో తెలుసా..?
ఏ సినిమా తీసుకున్నా ఏమున్నది గర్వకారణం.. అన్నిచోట్లా ఉన్నదదే లీకుల పర్వం అన్నట్లు మారిపోయిందిప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి. పెద్దా చిన్నాతో పని లేదు.. అన్ని సినిమాలకి లీకుల బెడద తప్పట్లేదు. అయితే అది అలా ఉంటే.. విజయ్ తన ఫ్రెండ్ రష్మికతో త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్, రష్మికల మధ్య ఎప్పటి నుంచో ఏదో ఉందని.. ఓ టాక్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ గీత గోవిందం అనే సినిమా నుంచి మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఈ సినిమా హిట్ తర్వాత ఈ కాంబినేషన్‌లో డియర్ కామ్రెడ్ వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అయినా ఈ ఇద్దరి మధ్య బాండింగ్ మాత్రం తగ్గలేదు. రష్మిక దాదాపుగా ప్రతి పండుగకు విజయ్ ఇంటికి వస్తుందని సోషల్ మీడియా టాక్. అంతేకాదు ఈ జంట ఆ మధ్య వెకేషన్ కోసం మాల్దీవ్స్‌కు వెళ్లినట్లు రూమర్స్ వినిపించాయి. ఇక లేటెస్ట్‌గా ఈ జంట వివాహా బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది.
అందులో భాగంగా అతి త్వరలో ఈజంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుందని లేటెస్ట్ టాక్. దీనికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయని.. ఓ మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకోనున్నారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఈవెంట్ ఫిబ్రవరిలో సెకండ్ వీక్‌లో ఉండనుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.