Health

పెళ్లిలో ఈ తప్పులు చేసిన భార్యభర్తలే విడాకులు తీసుకుంటున్నారా..?

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. అయితే భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది.

దేవుడు వేసే బంధం అని చాలా పవిత్రంగా భావిస్తారు..అయితే పూర్వకాలం నుండి పెళ్ళికి ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో అనేక రకాల పొరపాట్లు చేస్తూ పెళ్లిని చాలామంది పట్టించుకోవడం లేదు.ఇక పెళ్లి అనేది గతంలో అయితే జీవితంలో ఒకేసారి వచ్చేది.కానీ ఈ మధ్య కాలంలో చాలామంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

నిజానికి జీవితం ఒకరితోనే ముడిపడి ఉంటుంది.. అయితే పెళ్లి విషయంలో కొన్ని తప్పులు చేస్తే మాత్రం భార్యా భర్తలు విడిపోతారని పండితులు అంటున్నారు. ఆ తప్పులు ఏంటంటే.. ఈ మధ్యకాలంలో పెళ్లి అనేది ఫ్యాషన్ గా మారిపోయింది.. గొప్పగా చెప్పుకోవడం కోసం ఏవేవో చేస్తున్నారు.. ముఖ్యంగా తలంబ్రాలు పోసుకున్నాక థర్మకోల్ బబుల్స్ తల పై పోసుకోవడం. కానీ ఇలా వాటిని పోసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇలా థర్మకోల్ బబుల్స్ పెళ్లిలో వాడడం వల్ల బంధువుల మధ్య గొడవలు జరుగుతాయట.

అందుకే వీటిని వాడకుండా కేవలం తలంబ్రాలు మాత్రమే పోసుకోవాలట… అలాగే పెళ్లి జరిగే ప్రదేశంలో చెప్పులను అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే మండపంలో దేవతలు ఉంటారు.. దైవ సాక్షిగా జరుగుతున్న పెళ్లికి వారు వస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు ధరించకూడదు.. అనుకున్న ముహూర్తానికి తాళి కట్టరు. పంతులు పెట్టిన ముహూర్తానికి వధువు మెడలో వరుడు తాళి కట్టకపోతే ఆ పరిణామం తర్వాత చూడాల్సి వస్తుందట.ఎందుకంటే అనుకున్న ముహూర్తానికి పెళ్లి కాకపోతే ఆ వధూవరుల మధ్య గొడవలు వస్తాయట.

మరీ ముఖ్యంగా ప్రతి చిన్న విషయంలో గొడవలు వచ్చి చివరికి విడిపోయే వరకు వెళ్తారని చెబుతున్నారు.. అందుకే పెళ్లి ని ఎంత పవిత్రంగా చేసుకుంటామో అంత బలంగా బంధం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు.. ఈ విషయాలను ఆలోచించండి.. మనం చేసే దాన్ని బట్టే బంధం బలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker