News

పెళ్లికి ముందు బీపీ ఎందుకు చెక్ చేయించుకోవాలో తెలుసా..? లేదంటే..?

పెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. అయితే పెళ్లికి ముందు బీపీ లేదండీ… పెళ్లయ్యాక వచ్చిందండీ అని చాలా మంది చెబుతుంటారు. అయితే అది ఒక జోక్ గా చాలా మంది పరిగణిస్తారు. ఆ విషయం చెప్పిన వ్యక్తి కూడా ఫైనల్ గా అదే కంక్లూజన్ కి వస్తుంటాడు. ఎవరి పర్సనల్ అనుభవాలు వారివి అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ విషయంపై తాజాగా ఒక అధ్యయనం కీలక విషయాలు వెల్లడించింది. దీంతో పెళ్లికీ బీపీకి సంబంధం ఉందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును… పెళ్లికీ బీపీకీ సంబంధం ఉందా అనే విషయాలపై తాజాగా ఒక అధ్యయనం కీలక విషయాలు వెల్లడించింది. ఇటీవల తెరపైకి వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం వృద్ధులతోపాటు మధ్యవయసులో ఉన్నవారిలో రక్తపోటు ఎదుర్కుంటున్న జంటలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది! ఇంగ్లండ్, ఇండియా, చైనా, యునైటెడ్ స్టేట్స్‌ లో నిర్వహించిన తాజా పరిశోధనల్లో ఈ మేరకు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా… జీవిత భాగస్వామిలో ఒకరికి రక్తపోటు ఉంటే మరొకరికి కూడా రక్తపోటు వచ్చే అవకాశం గణనీయంగా ఉందని తేలింది! అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం… పైన పేర్కొన్న నాలుగు దేశాలలో సుమారు 30,000 జంటల డేటాను పరిశీలకులు పరిశోధించారంట.

ఈ సందర్భంగా ఏయే దేశాల్లో జంటల పరిస్థితి ఎలా ఉందనేది తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… అత్యధికంగా ఇంగ్లండ్ లోని జంటల్లో దాదాపు 47%, యునైటెడ్ స్టేట్స్‌ లోని జంటల్లో 37.9%, చైనాలో 20.8%, ఇండియాలో 19.8% జంటల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలిందని తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య జరిగే ఆరోగ్యకరమైన సంభాషణలు, ఇద్దరి జీవన విధానం అనేవి బీపీ పై గణనీయంగా ప్రభావం చూపిస్తాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందని తెలుస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం… ఇండియా, చైనా కంటే యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లండ్‌ లో అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువ శాతం ఉన్నారని తెలుస్తుంది.

అయితే భార్యభర్తల్లో అధిక రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య మాత్రం చైనా, ఇండియాలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. వాస్తవానికి చైనా, ఇండియా దేశాల్లో కుటుంబం కలిసి ఉండాలనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. దీంతో… ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదే సమయంలో… వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలితో రక్తపోటును నియంత్రించుకోవచ్చని కూడా సూచిస్తున్నారు. అలా మ్యూచువల్ పర్యవేక్షణ లేని జంటల్లో ఈ అనారోగ్య సమస్య ఉంటుందని చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker