పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే వెంటనే పెళ్లి చేసుకుంటారు.
పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులు గురయిన వారిపై పరిశోధన చేయగా.. వారంతా వైవాహిక బంధానికి దూరంగా ఉన్నవారేనని తేలింది.
వారిలో చాలా మంది భార్య/భర…నుంచి విడాకులు తీసుకొని ఎమోషనల్ గా ఒత్తిడి ఫీలైనవారే. మరి కొందరు భర్త లేదా భార్యని కోల్పోవడం, కొందరు అయితే అసలు వివాహమే చేసుకోని వాళ్లు ఉన్నారు. కేవలం పురుషుల్లో మాత్రమే కాదు.. మహిళల్లోనూ ఇది వర్తిస్తుందట. మహిళలు సైతం, తమ భర్తతో కలిసి ఉంటే ఎక్కువ కాలం ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారని తేలింది.
దాదాపు 6,051మందిపై నాలుగేళ్లపాటు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భర్త/ భార్యని కోల్పోయిన వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 71శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇక విడాకులు తీసుకోవడం లాంటివి చేసిన వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం 41శాతం ఉంది. అసలు వివాహమే చేసుకోని వారిలో 40శాతం రిస్క్ ఉంది.
చూసారుగా వివాహం అనేది మనిషి జీవితం లోఎంత ముఖ్యమైనదో. చతురాశ్రమములలో గృహస్థాశ్రమము ఉత్తమమైనది. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. వివాహం ద్వారా మాత్రమే సుఖం పొందడమనేది చాల శ్రేయస్కరం. పిల్లల కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది.పురుషుడి కి “క్రమ బద్ధమైన జీవితాన్ని , స్త్రీ కి భధ్రతను భరోసా ని ఇస్తుంది వివాహం.