పెళ్లికి ముందే బరువు తగ్గండి, లేదంటే ఏమవుతుందో తెలుసా..?
మన వయసుకు తగిన దానికన్నా ఎక్కువ బరువు ఉంటే దానిని ఊబకాయం అంటారు. అధిక బరువు వలన షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎనిమిది గంటలు కన్నా ఎక్కువ నిద్ర పోయినా, ఎక్కువగా ఒత్తిడి కలిగినా కూడా బరువు పెరుగుతారు. అయితే పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా జనరల్‌గా ఒక్కసారే జరిగే ఘట్టం. దాన్ని ఎంత అందంగా చేసుకుంటే అంత ఆనందం. అలాంటి పెళ్లిని అట్టహాసంగా జరుపుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు రెండు వైపుల కుటుంబాల వాళ్లు. ఐతే… ఈ హడావుడిలో… స్లిమ్‌గా కనిపించాలనే విషయాన్ని మర్చిపోతుంటారు చాలా మంది వధూవరులు. పెళ్లిలో ఎంతో మంది చుట్టాలు వస్తుంటారు.
వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలూ తీసుకుంటారు. అన్నింట్లోనూ అందంగా కనిపించాలంటే… బాడీ ఫిట్‌నెస్ తప్పనిసరి. కానీ… పెళ్లి అనేది చెప్పి రాదు. సడెన్‌గా నిర్ణయిస్తారు. ముహూర్తానికి ఎక్కువ టైమ్ ఉండదు. చాలా పెళ్లిళ్లు మాగ్జిమం నెలలోపే జరిగిపోతున్నాయి. పెళ్లికి డ్రెస్, హెయిర్‌స్టైల్, మేకప్, వెన్యూ ఇవన్నీ ఎంత ముఖ్యమో… ఫిట్ నెస్ కూడా అంతే ముఖ్యం. మంచి ఫిట్‌నెస్ కోసం రకరకాల ఎక్సర్‌సైజులున్నాయి. ఐతే… అందరికీ అన్నీ సెట్ కావు. ఎందుకంటే అందరూ ఒకే రకమైన బరువు సమస్యలతో ఉండరు. కొందరికి పొట్ట ఎక్కువగా ఉంటుంది. కొందరికి తొడలు లావుగా ఉంటాయి. కొందరికి భుజాలు పెద్దగా ఉంటాయి. కొందరికి ఫేస్ లావుగా కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన సమస్య ఉండే ఛాన్సుంది.
కానీ అందరి కళ్లూ మనమీదే ఉండేలా చేసుకోవాలంటే… మనం అదిరిపోయే ఫిట్‌నెస్‌తో కనిపించాలి. అమ్మాయైనా, అబ్బాయైనా, ఏ జిమ్‌కి వెళ్తున్నారో తెలుసుకోవాలని వచ్చిన వాళ్లు అనుకునేలా కనిపించాలి. నెలలోపు బరువు తగ్గలేమని ఫిక్స్ అయితే… మీరు సన్నగా కనిపించేందుకు ఎలాంటి డ్రెస్ సెట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎలా నిల్చుంటే, ఎలా కూర్చుంటే సన్నగా కనిపిస్తున్నారో అలాగే నిల్చోవాలి, కూర్చోవాలి. తద్వారా వచ్చిన వాళ్లకు మరీ అంత లావుగా ఉన్నట్లు కనిపించారు. జనరల్‌గా పొడవు డ్రెస్సులు వేసుకుంటే… మనుషులు పొడవుగా గనిపిస్తారు. పొట్టి డ్రెస్ వేసుకుంటే పొట్టిగా, లావుగా కనిపిస్తారు. కింద రెండు కాళ్లూ మడతపెట్టుకొని నిఠారుగా కూర్చొని (పద్మాసనం) తలపై ఓ పుస్తకాన్ని పెట్టుకోండి.
ఇప్పుడు ఆ పుస్తకం పట్టుకోకుండా అది తలపై నుంచీ కింద పడకుండా లేచి నిలబడాలి. ఇలా ఎప్పుడైతే చేయగలుగుతారో… అప్పుడు అదే పుస్తకాన్ని తలపై అలా ఉంచుకొని… రోజూ 10 నుంచీ 15 నిమిషాలు నడవాలి. మధ్య మధ్యలో పుస్తకం కింద పడకుండా కూర్చొని లేవడం అలవాటవ్వాలి. దీని వల్ల మీ బాడీలో కొవ్వు చాలా వరకూ కరిగిపోతుంది. త్వరగా బరువు తగ్గాలంటే నడక, జాగింగ్ తప్పనిసరి. ఇవి రెండు మెట్లు ఎక్కుతూ, దిగుతూ చేస్తే ఇంకా త్వరగా బరువు తగ్గుతారు. అలాగే… స్టర్డీ చైర్‌తో ప్రెస్-అప్స్, డిప్స్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వాటితోపాటూ… జంపింగ్ జాక్స్, నీలిఫ్ట్స్, ఉన్నచోటే జాగింగ్ వంటివి చెయ్యవచ్చు. అలాగే… 30 సెకండ్లలో 12 సార్లు సిట్-అప్స్ (గుంజీలు) చెయ్యాలి. ఇలా బాడీ వేడెక్కి కొవ్వు కరిగేందుకు వీలయ్యే అన్ని పనులూ చెయ్యాలి.
చెమట పట్టాలి. అప్పుడు నెల రోజుల్లో అదిరిపోయే ఫిట్‌నెస్ మీ సొంతం అవుతుంది. ఇందుకోసం జిమ్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే ట్రై చెయ్యవచ్చు.మొదటి వారం తక్కువ ఎక్సర్‌సైజ్ చేసి… రెండో, మూడో వారంలో దాన్ని పెంచుకుంటూ పోవాలి. మొదట్లో రోజుకు 20 నిమిషాలు నడిస్తే… వారం తర్వాత 30 నిమిషాలు, మూడో వారంలో 40 నిమిషాలు నడవాలి. వారాలు పెరిగే కొద్దీ ఎనర్జిటిక్ ఫుడ్ తీసుకుంటూ… ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రధానంగా బాడీలో ఏ పార్ట్ ఎక్కువ లావుగా ఉందో చూసుకొని… దాన్ని తగ్గించుకోవడానికి ఏమేం చెయ్యాలో అలాంటివి చేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. బరువు తగ్గేందుకు తీసుకునే ఆహారంపైనా శ్రద్ధ పెట్టాలి. కొవ్వు తెప్పించే ఆహారాలు మానుకోవాలి.
అంటే చాకొలెట్స్, ఐస్‌క్రీమ్, లిక్కర్, కూల్ డ్రింగ్స్, ఎనర్జీ డ్రింక్స్, స్వీట్స్, ఫ్రైలు, ఆయిల్ ఫుడ్ తినడం తగ్గించాలి. ఇవి ఎప్పుడూ బరువు పెంచేవే. వీటికి దూరంగా ఉంటూ… వీటి స్థానంలో మాంసం, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, మొలకలు, పండ్లు, గింజలు, కాయలు, తృణధాన్యాల వంటివి తింటే… ఇవి ఏమాత్రం బరువు పెరగనివ్వవు.ఇక్కడే మరో రూల్ కూడా ఉంది. ఏదైనా ఎక్కువ మొత్తంలో తింటే ప్రమాదమే. అంటే మాంసం బరువు తగ్గిస్తుంది కదా అని ఎక్కువగా తింటే… అదే మాంసం వల్ల బరువు పెరిగే ప్రమాదమూ ఉంటుంది. సో… ఆకలి వేసినంత మాత్రమే తినాలి. ఆకలి లేకపోయినా తినకూడదు. తినేటప్పుడు కూడా రోజుకు ఐదుసార్లు చిన్న మొత్తాల్లో ఆహారం తీసుకుంటే, పొట్టా రాదు, బరువూ పెరగరు. ఫలితంగా పెళ్లి నాటికి సూపర్ ఫిట్‌నెస్‌తో అందరి కళ్లూ మీపైనే ఉండేలా చేసుకోగలరు.