Health

మామిడికాయలను నానబెట్టి తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అశ్చ్యర్యపోతారు.

పిల్లలు, పెద్దలు, అందరికీ మామిడిపండ్లు అంటే చాలా ఇష్టం. మామిడి పండ్లను తినడం కాస్త కష్టమే అయినప్పటికీ. చాలా మంది మామిడి పండు పిసుక్కొని దాని గుజ్జు, రసం తినాని చూస్తుంటారు. మామిడి పండ్లను ఇష్టానుసారంగా తినాలని కోరుకుంటారు. అయితే మామిడి పండ్లను తినడానికి సరైన మార్గం ఏమిటో తెలుసా? మామిడికాయలను తినడానికి ముందు 1-2 గంటలు నీటిలో నానబెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఇప్పుడు అలా ఎందుకు అంటారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే వేసవి కాలంలో మామిడి పండ్లు విచ్చలవిడిగా లభిస్తాయి.

అంతేకాకుండా వీటిని తాయరు చేసిన రెసిపీలు కూడా భారతీయులు తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే దీనిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రభావవంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

అయితే నానబెట్టి మామిడి పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నానబెట్టిన మామిడికాయలు తినడం వల్ల కలిగే లాభాలు.. మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తినడం వల్ల చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నానబెట్టకుండా తినడం వల్ల ముఖంపై మొటిమలు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు నానబెట్టి తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టి మామిడి తినడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు సులభంగా కరుగుతుంది. ఇందులో ఫైటోకెమికల్స్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా నీటిలో నానబెట్టిన మామిడి తీసుకోవాల్సి ఉంటుంది. మామిడి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

క్రమం తప్పకుండా నానబెట్టిన మామిడి ముక్కలను తినడం వల్ల థర్మోజెనిక్ ఉత్పత్తి తగ్గుతుంది. మామిడిని పండుగా చేసే పద్ధతిలో క్రిమిసంహారక మందులు వాడతారు. అయితే నీటిలో నానబెట్టి తినకపోతే నొప్పి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా మామిడి తినే క్రమంలో నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker