Health

రోజు రెండు ఈ ఆకులు తింటే థైరాయిడ్ సమస్య తగ్గిపోతుంది.

థైరాయిడ్‌ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. థైరాయిడ్‌ గ్రంధి పిట్యూటరీ అనబడే యింకొక గ్రంధి హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. అయితే ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో జీవనశైలి పూర్తిగా మారిపోతోంది. సమయానికి తినకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం ఫలితంగా అనారోగ్యానికి గురవడం జరిగింది.

తప్పుడు జీవనశైలి కారణంగా.. అనేక మంది స్థూలకాయం, ఊబకాయం, థైరాయిడ్, హార్మోన్స్ లోపం, మధుమేహం వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒకసారి వీటిన బారిన పడితే.. జీవితాంతం మెడిసిన్స్ మింగుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మనం తినే ఆహారం వల్ల వీటిల్లో కొన్ని సమస్యలను తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. తప్పుడు జీవనశైలి కారణంగా వచ్చే సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది.

అయితే, థైరాయిడ్ సమస్య వస్తే ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పేర్కొనే మునగాకుతో థైరాయిడ్ సమస్యు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. మునగాకుతో ఇలా చేస్తే సమస్యకు చెక్.. థైరాయిడ్ సమస్య ఉన్న వారు మునగాకుతో దీనిని కంట్రోల్‌లో పెట్టొచ్చంటున్నారు నిపుణులు. మునగాకు పప్పు, పచ్చడి రోజూ తినాలని సూచిస్తున్నారు. మునగాకులను కషాయంగా చేసుకుని రోజూ తాగినా మంచి జరుగుతుందంటున్నారు.

తరచుగా మునగాకును ఏదో రూపంలో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. లక్షణాలివే.. థైరాయిడ్ వచ్చిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. నీరసం, అలసట, మానసిక అలజడి, బరువు పెరగడం, అతినిద్ర, చర్మ పొడిబారడం, జట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని ఆటో ఇమ్యూన్ సమస్య అంటారు. అయోడిన్ లోపం, ఒత్తడి, జీవన విధానంలో లోపాల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.

ఈ ఆహారాలు తక్కువ తీసుకోవాలి.. థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేసే ఆహారాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, బీరికాయ, స్ట్రాబెర్రీస్ ను అతిగా తినొద్దని సూచిస్తున్నారు. యోగా మేలు..థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో యోగా అద్భుతంగా పని చేస్తుంది. యోగసనాల్లో మత్స్య, భుజంగ, జిహాముద్ర, ఉజ్జయీ ప్రాణయామం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker