మాల్స్, కార్యాలయాలలో టాయిలెట్ తలుపులు ఇలా ఎందుకు ఏర్పాటు చేస్తారు. కారణం ఇదే..!
ఇల్లు లేదా హోటల్ గదిలో టాయిలెట్ తలుపు పై నుండి క్రిందికి ఉంటాయి. కానీ షాపింగ్ మాల్స్, థియేటర్లు, హాస్పిటల్స్ వంటి పబ్లిక్ టాయిలెట్లలో టాయిలెట్లకు పూర్తి తలుపులు ఉండవు. అయితే టాయిలెట్స్ రూమ్‌లలో గాలి, వెలుతురు సరిగ్గా ఉండేలా చూడాలి. కొన్ని టాయిలెట్స్ రూమ్‌లలో డోర్స్ కొంత ఎత్తుగా బిగిస్తుంటారు. అయితే టాయిలెట్లలో ఎత్తైన తులపులు ఉండటానికి ఒక కారణం ఉంది.
తలుపులు ఎత్తుగా ఉండడం వల్ల తేమకు గురికాకుండా ఉంటాయి. ఎత్తైన తలుపుల కారణంగా మరుగుదొడ్లు, టాయిలెట్లలో గాలి, వెలుతురు బాగా ఉంటుంది. టాయిలెట్ ఉపయోగించే వ్యక్తికి అత్యవసర ఆరోగ్య సమస్య ఉంటే, ఇలా డోర్లు ఎత్తుగా ఉంటే వాటిని సులభంగా తొలగించవచ్చు. మూసివేసిన టాయిలెట్‌లో ధూమపానం చేసినా తెలిసిపోతుంది. చాలా మంది టాయిలెట్స్‌లో పొగతాగుతుంటారు.
పూర్తిగా మూసి ఉన్న టాయిలెట్‌లో పొగను నింపడం వల్ల ఆరోగ్యానికి మరింత హాని కలుగుతుంది. అలాగే మరుగుదొడ్లలో పొగతాగితే సిగరెట్ పొగ సులభంగా బయటకు వస్తుంది. గాలి, వెంటిలేషన్ సరిగ్గా ఉంటుంది. అందుకే మరుగుదొడ్లలో తలుపులు పూర్తిగా ఉండకుండా కింది భాగంలో కొత్త కట్ చేసినట్లుగా ఉంటుంది. ఇందులో ఒక ప్రయోజనం ఏమిటంటే.. మరుగుదొడ్డి వాడేందుకు వచ్చిన అవతలి వ్యక్తికి ఒక వ్యక్తి పొగతాగుతున్నాడని తెలిసిపోతుంది.
అందువల్ల ధూమపానం చేయకుండా నివారించడనికి ఉపయోగపడుతుంది. దీంతో పొగతాగితే పట్టుబడతారు. అందుకే అలాంటి తలుపులు ఉన్న టాయిలెట్లలో ధూమపానం చేయకుండా ఉండడానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఇలా మరుగుదొడ్లకు తలుపులు ఎత్తుగా ఉండటం వల్ల ఎవరైనా బయటి నుంచి తాళం వేసినా, ఏదైనా ప్రమాదంగా ఉన్నా.. డోర్లను తొలగించేందుకు సులభంగా ఉంటుంది.