పురుషుల గర్భ నిరోధక మాత్రలు వచ్చేశాయి, ఎలా వాడలో తెలుసుకోండి.
ఇటీవల కాలం లో పిల్లలను ఎప్పుడు కనాలి అని ప్రతి ఒక్కరూ ఒక టైం పెట్టుకుంటున్న నేపథ్యం లో ఇక గర్భ నిరోధక మాత్రలు వాడటం సర్వ సాధారణం గా మారి పోయింది. ఒకవేళ మహిళలు గర్భ నిరోధక మాత్రలు వాడటానికి ఇష్ట పడకపోతే ఇక పురుషులు కండోమ్స్ లాంటివి వాడటం ద్వారా ఇక శృంగారం లో పాల్గొన్నప్పుడు అవాంఛిత గర్భం దాల్చకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే గర్భనిరోధక మాత్రలు అంటే అవి మహిళలకు మాత్రమే అనే భావన ఉంది. పురుషుల్లో గర్భనిరోధకగా పనిచేసేవి కండోమ్స్, లేదా వ్యాసెక్టమీ. మహిళ్లలో గర్భ నిరోధక మాత్రలు వాడటం వల్ల అనేక రకాల సమస్యలను వారు అనుభవిస్తున్నారు.
ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడం.. వారి రుతక్రమం సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే పురుషులకు గర్భ నిరోధక మాత్రలు ఉంటే బాగుంటుందన్న వాదన బలంగా బయటకు వచ్చింది. దీనికి సమాధానం చెబుతూ లను పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి కేవలం 30 నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తాయి.
దాని ప్రభావం 24 గంటల వరకూ ఉంటాయి. ఎవరు కనిపెట్టారు. పురుషుల గర్భనిరోధక మాత్రలను వీల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను ప్రభావితం చేసే సోల్యూబుల్ అడెనిలిల్ సైక్లాస్(ఎస్ఏసీ) అనే ప్రోటీన్ లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది. ఈ ప్రోటీన్ ఉత్పత్తి కాకుండా ట్యాబ్లెట్ నిరోధిస్తుంది. ఫలితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
ఎలుకలపై ప్రయోగాలు..ఈ మెడిసిన్ సక్రమంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మగ ఎలుకలకు టీడీఐ11862 అనే ఎస్ఏసీ నిరోధకాన్ని ఇచ్చి.. తర్వాత అది ఆడ ఎలుకలతో కలిసేలా చేశారు. దాదాపు 52 సార్లు సంభోగం అయ్యేలా ఎలుకలను ప్రోత్సహించినప్పటికీ ఒక్క ఆడ ఎలుక కూడా గర్భవతి కాలేదు. అంతేకాక ఇది చాలా వేగంగా పనిచేసిందని పరిశోధకులు కొనుగొన్నారు.
30 నుంచి 60 నిమిషాల్లోనే ఎలుకల స్పెర్మ్ లో దీని ప్రభావం కనిపించింది. అలాగే 100 శాతం ప్రభావవంతంగా ఇది పనిచేసింది. పైగా ఈ ట్యాబ్లెట్ ప్రభావం ఆ మగ ఎలుకపై కేవలం 24 గంటల వరకూ మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత ఎలుకలకు తిరిగి సంతానోత్పత్తి సాధించగలిగే విధంగా అయ్యిందని పరిశోధకులు గుర్తించారు. ఆరు వారాల వరకూ పరిశోధకులు ఎలుకలకు ఈ మందు రోజూ ఇచ్చినా ఎటువంటి చెడు ప్రభావాలు ఇవ్వలేదు.