News

మహేష్ బాబు వెంటపడ్డ పోలీసులు, దీంతో మహేష్ ఏం చేసాడో తెలుసా..?

బాల న‌టుడిగా ఎన్నో చిత్రాల్లో న‌టించిన ఆయ‌న రాజ‌కుమారుడుతో హీరోగా మారారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ సూప‌ర్‌స్టార్ అయ్యారు. అలాంటి హీరోగా గురించిన వార్త‌ల‌ను తెలుసుకోవాల‌నే ఇంట్రెస్ట్ అంద‌రిలోనూ ఉంటుంది. తాజాగా మ‌హేష్‌కి సంబంధించి రెండు సీక్రెట్స్‌ను ఆయ‌న బాబాయ్ ఆది శేష‌గిరిరావు రీసెంట్ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట పెట్టారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. ఇక మహేష్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయనకు తండ్రి కృష్ణ అంటే ఎంత ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది మహేష్.. తండ్రి కృష్ణను పోగొట్టుకున్న విషయం తెల్సిందే. ఇక మే 31 న కృష్ణ జయంతి. ఆరోజున కృష్ణ నటించిన మోసగాళ్లకుమోసగాడు సినిమా రీ రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మీడియాతో పంచుకున్నారు. అప్పట్లో కృష్ణ సినిమాలకు దాదాపు రూ. 5 లక్షలు ఖర్చు అయ్యేదని, మోసగాళ్లకు మోసగాడు సినిమాకు మాత్రం రూ. 7 లక్షలు ఖర్చుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలోనే ఆయన మహేష్ బాబు గురించి మాట్లాడారు.

మహేష్- నమ్రత పెళ్లి మొదట ఇందిరా దేవికి చెప్పారని, ఆమెనే.. కృష్ణను ఒప్పించిందని తెలిపారు. ఈ పెళ్ళిలో తన పాత్ర ఏది లేదని, వంశీ సినిమా కోసం నమ్రతను తీసుకున్నామని చెప్పారు. నమ్రత అంటే ఆమెకు చాలా ఇష్టమని తెలిపారు. ఇక 14 ఏళ్ల వయస్సులో మహేష్ బాబు వెంట పోలీసులు పడ్డారట. ” మహేష్ 14 ఏళ్ళ వయస్సులో కారు నేర్చుకున్నాడు.

కారు నేర్చుకున్న వెంటనే ఇంట్లో కారు తీసుకొని రోడ్లపైకి వెళ్ళాడు. అప్పుడు పోలీసులు లైసెన్స్ కోసం కారు ఆపమన్నారు. కానీ, మహేష్ కారు ఆపకుండా డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇక అతడి వెంట పోలీసులు కూడా వచ్చారు. అప్పుడు నేనే వారికి సర్దిచెప్పి పంపించేశాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker