News

రియల్ హీరో, మంచాన పడ్డ అభిమాని కుటుంబాన్ని దత్తత తీసుకున్న మహేశ్.

చాలా రోజుల వరకు మహేష్‌ చేసే సేవా కార్యక్రమాల గురించి బయటకు తెలిసేది కాదు. కానీ మరింత మందికి సాయం చేయడం కోసం కొన్నాళ్ల క్రితం ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మహేశ్‌ బాబు. చావు బతుకుల మధ్య ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక.. అతడి పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే తాజాగా మరొక మంచి పని చేశాడు మహేశ్ బాబు.

ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న ఒక అభిమాని కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. తద్వారా తనే కాదు తన మనసు కూడా బంగారమంటూ మరోసారి నిరూపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెద ప్రోలుకు చెందిన రాజేష్ మహేశ్ బాబుకు అలాగే స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమాని. అయితే అతను గత కొంత కాలం నుంచి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

రాజేష్ మంచాన పడడంతో అతని మీదే ఆధారపడిన కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. రాజేష్ కు ఇంకా చిన్న వయసులోనే ఉన్న ముగ్గురు కొడుకులు ఉన్నారు. మహేశ్ మీద అభిమానంతో వారికి అర్జున్, అతిథి, ఆగడు అంటూ మహేష్ సినిమాల పేర్లనే తాను పెట్టుకున్నాడు. వీరిలో పెద్దవాడు అర్జున్ స్థానికంగా ఉండే చెప్పుల దుకాణంలో ఏదో చిన్న పని చేస్తూ ఖర్చులకి సంపాదిస్తున్నాడు. కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా మహేశ్ బాబు దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన రాజేష్ కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు.

అతని ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నాడు. వారికి విద్యతో పాటు అన్నీ సదుపాయాలు ఇక మహేష్ బాబే చూసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. సంగీత దర్శకుడు థమన్ సైతం సోషల్ మీడియా వేదికగా మహేశ్ చేసిన మంచి పనిని ప్రశంసించారు. ఇక అభిమానులు, నెటిజన్లు కూడా మహేశ్ దేవుడంటూ నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. ఆయన లాగే మరికొంతమంది హీరోలు సాయం చేసేందుకు ముందుకు రావాలంటూ కోరుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker