Mahesh : హీరోయిన్ లా ఉన్న‘రంగస్థలం’ మహేష్ భార్యను ఎప్పుడైనా చూశారా..?
రంగస్థలం మహేష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియన్ హీరోలతో, పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన నటిస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న చిత్రంలో మహేష్ నటిస్తున్నారు. ఇక మారుతి ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ మహేష్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అయితే తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేష్… సినిమాల్లో కమెడియన్‌గా, కీలక పాత్రల్లో నటిస్తూ..
మంచి యాక్టర్‌గా ముందుకు సాగుతున్నాడు. అయితే నటుడిగా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు మహేష్. సినిమా ఆఫీసులు ఎంత దూరంలో ఉన్న నడుస్తూ వెళ్లేవాడు. తండ్రి చనిపోయినప్పుడు అతని వద్ద 10 రూపాయలు కూడా లేవు. జబర్దస్త్ షోలో వేషాల కోసం పడిగాపులు కాసేవాడు. షకలక శంకర్.. తొలుత అతడిని జబర్దస్త్ స్టేజ్ ఎక్కించాడు. అలా జబర్దస్త్‌లో కనపడుతూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు.
2017లో దర్శకుడు సుకుమార్ రంగస్థలంలో అవకాశం ఇచ్చిన తర్వాత.. అతడి ఫేట్ మారిపోయింది. ఆ చిత్రంలో చిట్టిబాబు స్నేహితుడిగా నటించి.. విపరీతమైన గుర్తింపు పొందాడు. మహేష్ స్కిల్ అందరికీ తెలియడంతో వెనువెంటనే అవకాశాలు వచ్చాయి. శతమానం భవతి, మహానటి చిత్రాలతో నటుడిగా స్థిరపడిపోయాడు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, నటుడు విశ్వక్ సేన్ వంటి వాళ్లు మహేష్‌ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మంచి పారితోషకం అందుకుంటూ మంచి సినిమాలు చేస్తున్నాడు మహేష్. అయితే తన ఎదుగుదలను తండ్రి చూడలేకపోయాడు అనే బాధ అతడిలో ఉంది.
తన సమీప బంధువుల అమ్మాయి పావనిని 2020 లాక్‌డౌన్ సమయంలో వివాహమాడాడు మహేష్. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2021లో ఓ ఆడబిడ్డ జన్మించింది. కాగా మహేష్ భార్య పావని కూడా కుందనపు బొమ్మలా.. ఎంతో పద్దతిగా ఉంటుంది. ఈ కపుల్ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ. తను కూడా మంచి నటి అవ్వొచ్చు. ట్రై చేస్తే అని కామెంట్స్ పెడుతున్నారు ఆమెను చూసిన నెటిజన్లు.