Health

ఈ చెట్టు గురించి ఎవరికీ తెలియని విషయాలు, ఈ కాయలు ఒక్కసారి తింటే చాలు.

దేశంలోని ప‌లు ప్రాంతాల్లో అర్జున వృక్షం బాగా పెరుగుతుంది. ఈ వృక్షాన్ని తెల్ల‌మ‌ద్ది అని కూడా పిలుస్తారు.అయితే ఎక్కువగా కలపగా ఉపయోగించే ఈ వృక్షాన్ని ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ వాడుతారు. తెలుపు, ఎరుపు రంగులో ఈ చెట్టు పెరుగుతుంది. అయితే ఈ వృక్షానికి గుండె జ‌బ్బులు, ఆస్త‌మా వంటి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి ఉంది. అయితే ఇది ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఎత్తు 2 నర మీటర్ల నుంచి దాదాపు 18,20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.

ఇది భాహుళ ప్రయోజనాలు కల్గిన చెట్టు. ఇది రంగుల తయారీలో, కలప తయారీలో, భోమ్మల తయారీలో మరియు వంట చెరకుగా కూడా ఉపయోగపడుతుంది. అంతే కాక వైద్యం పరంగా మానవుల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం లో మరియు ఆనారోగ్యాన్ని తగ్గించడంలో ఈ మద్ది చెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వైద్యులు లేదా ఈ చెట్టు గురించి తెలిసిన వారు ఎలా వాడాలి అంటే సంప్రదాయ ఔషద కారినిగా ఈ చెట్టుని వాడతారు.

ఆయుర్వేద వన మూలికలు అమ్మే షాపు లో దీని వేర్లు, ఆకులు, చిగురుతో లేదా కాడలతో తయారు చేసిన ఔషదాన్ని అమ్ముతారు.దీని బెరడు గోధుమ లేదా భుడిద రంగులో వుంటుంది. దీని పువ్వులు ఆకు పచ్చ రంగులో లేదా తెలుపు రంగులో వుంటాయి, ఇవి కాయ మీద పూస్తాయి తరువాత కాలంలో మెత్తబడి నల్లగా అవుతాయి ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి.మొదటిగా ఈ చెట్టు లో అల్కలాయిడ్స్, టానిన్స్, అంత్రో క్వినిన్స్, స్టేరల్స్, సపోనిన్స్, పాలిపినన్స్, టేర్పనలిస్, కార్డియ గ్లైకోసైట్స్ కూడా ఈ చెట్టు లో వున్నాయి.

మద్ది చెట్టు ఆకుని, కాండంని, బెరడుని, వేళ్ళను మలేరియా తగ్గించడానికి, డైబెటిస్ తగ్గించుకోవడానికి, జాండిస్ ను తగ్గించడానికి మరియు క్యాన్సర్ తగ్గించడానికి వాడతారు. ఇది మన దేశంలోని సాంప్రదాయ వైద్యులు, ఆయుర్వేద వైద్యులు వాడతారు వేరే దేశంలో కూడా ఈ చెట్టుని వాడతారు ముఖ్యంగా ఆఫ్రికా దేశంలోని పశ్చిమ ఆఫ్రికా వారి సాంప్రదాయ వైద్యంలో మద్ది చెట్టు చాలా ముఖ్యమైనది అని చెప్పవచ్చు. నైజీిరియాలో అయితే ఈ చెట్టు నుంచీ తయారు చేసిన మందుని జ్వరాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker