Health

ఈ డ్రింక్ ఒక్కసారి తాగితే చాలు ఊపిరితిత్తుల్లో పెరుకపొయిన కఫం మొత్తం బయటకి పోతుంది.

ఊపిరితిత్తుల్లో, శ్వాస నాళాల్లో పేరుకుపోయిన క‌ఫం మాత్రం పూర్తిగా తొల‌గిపోదు. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస సంబంధిత స‌మస్య‌ల‌ నుండి బ‌య‌ట‌ప‌డ‌డంతో పాటు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన క‌ఫమంతా తొల‌గిపోతుంది. అయితే చల్లని వాతావరణంలో కఫం త్వరగా పట్టేసింది. దాని వల్ల గొంతులో ఇబ్బంది,ముక్కు దిబ్బడ, ఒక్కోసారి ఆయాసంలా రావడం జరుగుతుంది. చల్లని వాతావరణంలో బ్యాక్టిరియాలు, ఇన్ఫెక్లన్లు త్వరగా సోకుతాయి. దాని వల్లే సమస్యలు మొదలవుతాయి.

కఫం ఎక్కువైతే జ్వరం కూడా వస్తుంది. అందుకే చలికాలం మొదలైందంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆయుర్వేదంలో కఫాన్ని విరిచే మందులు ఉన్నాయి. ఇవన్నీ మన వంటింట్లో దొరికేవే. ఏం చేయాలి.. ఇంగ్లిషు మందులు వాడకుండా ఆయుర్వేదంలో చెప్పిన విధంగా కఫాన్ని తగ్గించుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సింది మొదట ఉపవాసం. రోజులో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలి. తరచూ గోరు తేనె నీటిని వేసుకుని తాగుతూ ఉండాలి.

ఇలా ఉపవాసం చేస్తే తేనె నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి. తేనె నీరు అనగానే నీటిలో తేనె వేసుకుని తాగడం అనుకోకండి. గోరువెచ్చని నీళు తీసుకుని అందులో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేయాలి. అందులో ఆరు నుంచి ఏడు స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. దీన్ని జలుబు, దగ్గు, కఫం వేధిస్తున్నప్పుడు రోజులో నాలుగైదు సార్లు తీసుకోవాలి. ఆహారం మాత్రం తక్కువ తీసుకోవాలి. ఇలా తాగినప్పడు ఊపిరితిత్తులో, గొంతులో కఫం పలుచగా మారుతుంది.

ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది. పిల్లలకు కూడా..ఈ తేనె నీటిని పిల్లలకు కూడా తాగించవచ్చు. అలాగే వారికి నిమ్మరసం కూడా కలిపి ఇస్తే చాలా మంచిది. కఫం పట్టినప్పుడు, జలుబు చేసినప్పుడు కొబ్బరి నీళ్లను దూరం పెట్టాలి. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. అలాగని శరీరం నీరసిస్తుంది అనుకోవద్దు.

మధ్య మధ్యలో తాగే తేనె నీరు శక్తిని కూడా అందిస్తుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరిగి బ్యాక్టిరియాలతో పోరాడే శక్తి వస్తుంది. పిల్లలకు దగ్గు సిరప్‌కు బదులు ఇలా తేనె, యాలకుల పొడి, మిరియాల పొడి కూడా వేసి కలుపుకుని తాగితే చాలా మంచిది. కఫం పట్టే వరకు ఆగకుండా చలికాలం రాగానే ఈ తేనె నీటిని తాగుతూ ఉండాలి. వానా కాలంలో కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. రోగాలను తట్టుకునే శక్తిని అందిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker